Share News

kumaram bheem asifabad- పంటల పరిశీలన

ABN , Publish Date - Jul 11 , 2025 | 10:27 PM

v

kumaram bheem asifabad- పంటల పరిశీలన
: పెంచికలపేటలో పంటలను పరిశీలిస్తున్న అధికారులు

పెంచికలపేట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కమ్మర్‌గాం, మురళీగూడ, జిల్లెడ గ్రామాల్లో ప్రాణహిత వరద ఉదృతికి నీట మునిగిన పంటలను శుక్రవారం ఎంపీడీవో ఆల్బర్ట్‌ పరిశీలించారు. నష్ట పోయిన రైతుల పంట పొలాలను సందర్శించి రైతులో మాట్లాడారు. ప్రజలతో మాట్లాడుతూ భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఎవరు కూడా ప్రవాహక సమీప ప్రాంతాలకు వెళ్లకూడదని, చేప వేటక ఇతర ఏ విధమైన పనులు కూడా నది తీరం, వాగు ఉన్న ప్రాంతాల వద్ద వెళ్లకూడదన్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షించి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాకేష్‌, గణేష్‌, ప్రశాంత్‌, రాజ్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత బ్యాక్‌వాటర్‌, పెద్దవాగు వరద ఉధృతిలో ముంపుకు గురైన పంటలను ఎంపీడీఓ ఆల్బర్ట్‌ శుక్రవారం పరిశీలించారు. దిగిడ, రాంపూర్‌, యొట్లగూడ గ్రామల్లో తిరిగి పంటలను పరిశీలంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఎవరు కూడా ప్రవాహక సమీప ప్రాంతాలకు వెళ్లకూడదని, చేప వేటక ఇతర ఏ విధమైన పనులు కూడా నది తీరం, వాగు ఉన్న ప్రాంతాల వద్ద వెళ్లకూడదన్నారు. ఆయన వెంట కార్యదర్శులు విజయ్‌, ప్రశాంత్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 10:27 PM