పోషకాహారం తీసుకోవాలి
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:24 PM
టీబీ రోగులు పోషకాహార పదార్థాలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ రవికుమార్ అన్నారు.
- వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ కే రవికుమార్
కోడేరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : టీబీ రోగులు పోషకాహార పదార్థాలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ రవికుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి టీబీ రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. రోగులకు న్యూట్రిషన్ కిట్లను పంపి ణీ చేశారు. ఈ కార్యక్రమం భవిష్య భారత్ ట్ర స్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ రోగులు ఆరోగ్య పరీక్షలు చేయించు కొని డాక్టర్ సలహాల ప్రకారం మందులు వాడా లని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖ ర్, డాక్టర్ అనిల్, డీపీవో సీహెచ్‌వో క్వశ్చన్ సుదర్శన్, ఫార్మసి ఆఫీసర్ గెలుపు కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ నారాయణ, భవిష్య భారత్ సంస్థ ప్రతినిధులు హనుమంతు, బా లకృష్ణ, ఏఎన్‌ఎంలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఎయిడ్స్ నిర్మూలనపై కళాజాతా
కందనూలు : జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నిర్మూలనపై కళాజాత బృందం సభ్యు ల ద్వారా ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు అవ గాహన కల్పిస్తు న్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్ అన్నారు. మంగళ వారం జిల్లా కేంద్రంలో కళాజాత ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కార్యక్ర మంలో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి రాజగోపాలా చారి, డీపీవో రేణయ్య, దిశాప్రోగ్రాం మేనేజర్ రమేశ్, రవీందర్‌రెడ్డి, సాయికుమార్, స్వర మా ధురి, కళాజాత బృందం టీం లీడర్ పాల్గొన్నారు.