Share News

చిన్నతనం నుంచే పోషకాహారం అందించాలి

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:11 PM

చిన్నతనం నుం చే పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఐసీడీఎస్‌లు కృషి చేస్తు న్నాయని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కు డు వంశీకృష్ణ అన్నారు.

చిన్నతనం నుంచే పోషకాహారం అందించాలి
అచ్చంపేటలో ఎమ్మెల్యేను సన్మానిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది

- ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి) : చిన్నతనం నుం చే పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఐసీడీఎస్‌లు కృషి చేస్తు న్నాయని ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కు డు వంశీకృష్ణ అన్నారు. పట్టణం లోని 5వ వార్డులో ‘అమ్మమాట అంగన్‌వాడీ బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅ తిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుంచే పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఐసీడీఎస్‌ లు కృషి చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ము నిసిపల్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్‌ మాదవరెడ్డి, యూత్‌ కాం గ్రెస్‌ అధ్యక్షుడు క్యామ మల్లయ్య, ఐసీడీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మృతునికుటుంబానికి పరామర్శ

ఉప్పునుంతల : మండల పరిధిలోని ఈర్వ టోనిపల్లి గ్రామంలో గుండమోని నారయ్య (50) గుండెనొప్పితో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆ గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ స భ్యులను పరామర్శించారు. నాయకులు అనం తరెడ్డి, నర్సింహారెడ్డి, రంగారెడ్డి ఉన్నారు.

అంగన్‌వాడీ కేంద్రంలో ఎగ్‌ బిర్యానీ

పదర : మండలంలోని వంకేశ్వరం గ్రామ 4వ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం చిన్నారు లకు ఎగ్‌ బిర్యానీ వడ్డించారు. గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్లు, ఆయాలు స్వాగతం పలికారు. గ్రామస్థు లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:11 PM