NRIs Return Home to Exercise Voting Rights: ఓటు విలువ చాటి చెప్పారు...
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:50 AM
నేనొక్కడిని ఓటు వెయ్యకపోతే ఏముందిలే..!! అనే ఆలోచనతో కొందరు ఓటు వేసేందుకు గడప దాటరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుడి చేతిలో ఆయుధం లాంటి ఓటును లైట్....
నేనొక్కడిని ఓటు వెయ్యకపోతే ఏముందిలే..!! అనే ఆలోచనతో కొందరు ఓటు వేసేందుకు గడప దాటరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుడి చేతిలో ఆయుధం లాంటి ఓటును లైట్ తీసుకుంటారు. అలాంటి వారందరికీ ఓటు హక్కు విలువ తెలియజెప్పేలా.. పలువురు విదేశాల నుంచి వచ్చి మరీ పల్లెపోరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా పాతూరుకు చెందిన సందీప్ రెడ్డి ఉద్యోగ రిత్యా జర్మనీలో ఉంటున్నారు. పల్లెపోరు కోసం నాలుగు రోజుల క్రితమే జర్మనీ నుంచి స్వగ్రామానికి చేరుకున్న సందీప్ రెడ్డి ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన బొంత మణిచరణ్‌రెడ్డి కూడా పంచాయతీ ఎన్నికల కోసం స్వగ్రామానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు.