Share News

ఇక రాజన్న దర్శనం ఎల్‌ఈడీ స్ర్కీన్‌లలోనే

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:23 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనం ఇక నుంచి ఎల్‌ఈడీ స్ర్కీన్‌లలోనే చేసుకునేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి ఒక ప్రకటన సోమవారం రాత్రి విడుదలైంది. రాజన్న ఆలయ అభివృద్ధి ప్రణాళికలో

ఇక రాజన్న దర్శనం ఎల్‌ఈడీ స్ర్కీన్‌లలోనే
వేములవాడ రాజన్న ఆలయం

వేములవాడ కల్చరల్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి దర్శనం ఇక నుంచి ఎల్‌ఈడీ స్ర్కీన్‌లలోనే చేసుకునేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి ఒక ప్రకటన సోమవారం రాత్రి విడుదలైంది. రాజన్న ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అర్చకులు, వేదపండితుల విలువైన సూచనలు, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు, తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పిం చాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2026వ సంవత్సరంలో సమ్మక్క, సారలమ్మ జాతరకు ముందు, జాతర తరువాత రాజన్న దర్శనం కల్పించేలా భక్తుల సౌలభ్యం కోసం ఏర్పాట్లు కొనసా గుతన్నాయని పేర్కొన్నారు.

రాజన్న ఆలయ పరిసరాల్లోనే దర్శన భాగ్యం

- ఎండోమెంట్‌ దృష్టికి తీసుకువెళ్లిన బండి సజయ్‌

రాజన్న ఆలయ పరిసరాల్లోనే శ్రీస్వామి వారి దర్శన భాగ్యం ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు, తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులు దర్శనం చేసుకునేలా రాష్ట్ర దేవదాయశాఖ దృష్టికి తీసుకువెళ్లామని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల మనోభావాలని పరిగణలోకి తీసుకోవాలని, సాధు సంతుల సూచనలు మేడారం జాతర దృష్ట్యా పరిగణలోకి తీసుకోవాలని సూచించడంతో వివాదాలకు తావివ్వకుండా ఏకాభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 12:23 AM