Share News

వైన్‌ షాపుల టెండర్లకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:59 PM

వైన్‌ షా పు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చే సింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌ గ డువు నవంబర్‌ 30తో ముగియనుంది.

వైన్‌ షాపుల టెండర్లకు నోటిఫికేషన్‌

-నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ

-ఒక్కో దరఖాస్తు రుసుం రూ. 3 లక్షలు

-అక్టోబర్‌ 23న డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు

-నవంబరు నెలాఖరుకు వరకు పాత లైసెన్స్‌ గడువు

మంచిర్యాల, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వైన్‌ షా పు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చే సింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌ గ డువు నవంబర్‌ 30తో ముగియనుంది. 2025-2027 సం వత్సరానికి గాను ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయగా, జిల్లా స్థాయిలో అధికారులు మద్యం షాపు ల టెండర్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని మం చిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో గత మద్యం పాలసీ మాదిరిగానే ఈ సారి కూడా మొత్తం 73 ఏ4 మద్యం షాపులను ఏర్పాటు చే యనున్నారు. కొత్త లైసెన్స్‌లను లాటరీ పద్ధతిలో ఎం పిక చేసేందుకు అబ్కారీశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

పెరిగిన దరఖాస్తు రుసుము...

మద్యం షాపుల టెండర్లలో పాల్గొనదలిచే వ్యాపారు లు గతంలో కంటే అధికంగా దరఖాస్తు రుసుము చె ల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితితో ఒక్కో షా పునకు దరఖాస్తు చేసేందుకు రూ. 3 లక్షల నాన్‌ రి ఫండబుల్‌ ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం పాలసీలో దరఖాస్తు రుసుం రూ. 2 లక్షలు ఉండగా, ఈసారి అదనంగా లక్ష రూపాయలను పెంచింది. జిల్లా లో మద్యం వ్యాపారం లాభసాటిగా ఉండటంతో గతం లో మాదిరిగానే ఈ సారి కూడా లిక్కర్‌ వ్యాపారులు పోటీపడే అవకాశాలు ఉన్నాయి. మద్యం దుకాణాలకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించడంతో దరఖాస్తు చేసేం దుకు అవసరమైన సొమ్మును సమకూర్చుకునే పనిలో వ్యాపారులు నిమగ్నమయ్యారు. వ్యాపారులు కొంత మంది కలిసి సిండికేటుగా ఏర్పడి ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. అయితే ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చే సుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో ద రఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికా రులు భావిస్తున్నారు.

నేటి నుంచి ప్రక్రియ ప్రారంభం....

వైన్‌ షాపుల టెండర్లలో పాల్గొనదలిచే వ్యాపారులు ఈ నెల 26 నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు దరఖా స్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ముగి యగానే, సంబంధిత వ్యాపారుల సమక్షంలో అదే నెల 23వ తేదీన లక్కీ డ్రా నిర్వహించి దుకాణాల లబ్ధిదా రులను ఎంపిక చేస్తారు. లక్కీ డ్రా విజేతల కొత్త దుకా ణాలకు లైసెన్స్‌ కాలపరిమితి డిసెంబరు 1వ తేదీ నుం చి ప్రారంభమై 2027 నవంబరు 30 వరకు అమలులో ఉండనుంది. డిసెంబరు ఒకటవ తేదీ నుంచే దుకాణా ల్లో మద్యం విక్రయాలు జరిపేందుకు అవకాశం ఉంది.

షాపులకు రిజర్వేషన్లు ఇలా...

జిల్లాలో మద్యం షాపులకు రిజర్వేషన్లు గత మద్యం పాలసీకి భిన్నంగా వివిధ కేటగరీల దమాషానా షాపు లు కేటాయించనున్నారు. జిల్లాలో మొత్తం 73 మద్యం షాపులు ఉండగా మొత్తంగా 30 శాతం రిజర్వేషన్‌ అ మలు చేయనున్నారు. ఈ క్రమంలో 22 దుకాణాలను వివిధ వర్గాల వారికి రిజర్వు చేయనున్నారు. రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఎస్సీ సామాజిక వర్గాలకు 10, ఎస్టీ లకు 06, గౌడ కులస్థులకు గరిష్టంగా 06 శాతం షాపు లు కేటాయించనున్నారు. మిగతా 51 షాపులకు ఆయా రిజర్వేషన్‌ కేటగరీలతోపాటు నాన్‌ రిజర్వు వర్గాలకు చెందిన వ్యాపారులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.

వాయిదాల పద్ధతిలో లైసెన్స్‌ ఫీజు చెల్లింపు...

లైసెన్సు రుసుమును వాయిదాల పద్ధతిలో చెల్లించా ల్సి ఉంటుంది. అందులో మొదటి వాయిదాను అక్టోబరు 23,24 తేదీల్లో చెల్లించేలా నిర్ణయించారు. జనాభా ప్రాతి పదికన లైసెన్స్‌ ఫీజును స్లాబుల వారీగా నిర్ణయిం చా రు. లైసెన్సు ఫీజును గత మద్యం పాలసీ ప్రకారమే 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మొత్తం 17 షా పులు కేటాయించగా ఒక్కో దుకాణానికి యేడాదికి రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. 5వేల నుంచి 50వేల జనా భాగల పట్టణాల్లో 17 షాపులు ఉండగా సాలుసరి ఫీ జు రూ. 55 లక్షలు, 50వేల నుంచి 5 లక్షల జనాభా ఉ న్న ప్రాంతాల్లో 38 షాపులు ఉండగా రూ. 60 లక్షలు సాలుసరి లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయి తే జైపూర్‌ మండలం ఇందారంలో ఒక షాపు ఉండగా, ఇక్కడ మాత్రం గరిష్టంగా సాలుసరి లైసెన్సు ఫీజు రూ. 65 లక్షలు నిర్ణయించారు. ఇక్కడ 5వేల లోపు జ నాభా ఉన్నప్పటికీ రామగుండం మున్సిపల్‌ కార్పొరేష న్‌ నుంచి 5 కిలో మీటర్ల లోపు పెరిఫెరి ఉన్నందున ఇక్కడ రూ. 5 లక్షలు అధనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - Sep 25 , 2025 | 11:59 PM