వైన్ షాపుల టెండర్లకు నోటిఫికేషన్....
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:57 PM
వైన్ షాపు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిం ది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. 2025-2027 సంవత్స రానికి గాను ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయ గా, జిల్లా స్థాయిలో అధికారులు మద్యం షాపుల టెం డర్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని మంచి ర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గత మద్యం పాలసీ మాదిరిగానే ఈసారి కూ డా మొత్తం 73 ఏ4 మద్యం షాపులను ఏర్పాటు చే యనున్నారు. కొత్త లైసెన్స్‌లను లాటరీ పద్ధతిలో ఎం పిక చేసేందుకు అబ్కారీశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
-నెలాఖరులో మొదలు కానున్న దరఖాస్తు ప్రక్రియ
-మూడు నెలలు ముందుగానే టెండర్లు ఆహ్వానం
-నవంబర్ నెలాఖరు వరకు పాత లైసెన్స్ గడువు
-21న లక్కీ డ్రా ద్వారా లబ్దిదారుల ఎంపిక
-డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు
మంచిర్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వైన్ షాపు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిం ది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. 2025-2027 సంవత్స రానికి గాను ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయ గా, జిల్లా స్థాయిలో అధికారులు మద్యం షాపుల టెం డర్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని మంచి ర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గత మద్యం పాలసీ మాదిరిగానే ఈసారి కూ డా మొత్తం 73 ఏ4 మద్యం షాపులను ఏర్పాటు చే యనున్నారు. కొత్త లైసెన్స్‌లను లాటరీ పద్ధతిలో ఎం పిక చేసేందుకు అబ్కారీశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
పెరిగిన దరఖాస్తు రుసుము...
మద్యం షాపుల టెండర్లలో పాల్గొనదలిచే వ్యాపారు లు గతంలో కంటే అదనంగా దరఖాస్తు రుసుము చె ల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఒక్కో షాపునకు రూ. 3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజును ప్రభుత్వం నిర్ణయిం చింది. జిల్లాలో మద్యం వ్యాపారం లాభసాటిగా ఉండ టంతో ఈ సారి కూడా లిక్కర్ వ్యాపారులు దుకాణాల కోసం పోటీపడే అవకాశాలు ఉన్నాయి. మద్యం దుకా ణాలకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించేందుకు సిద్దప డుతుండటంతో దరఖాస్తు చేసేందుకు అవసరమైన సొ మ్మును సమకూర్చుకునే పనిలో వ్యాపారులు నిమగ్న మయ్యారు. వ్యాపారులు కొంత మంది కలిసి సిండికేటు గా ఏర్పడి ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. అయితే ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అ వకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దరఖా స్తు ప్రక్రియ ముగియగానే, సంబంధిత వ్యాపారుల స మక్షంలో లక్కీ డ్రా నిర్వహించి దుకాణాల లబ్దిదారు ల ను ఎంపిక చేస్తారు. లక్కీ డ్రాలో దుకాణాలు దక్కిం చుకున్న లబ్దిదారులకు డిసెంబరు 1వ తేదీ నుంచి లైసె న్స్ అమల్లోకి వస్తుండగా 2027 నవంబరు 30వ తేదీ వరకు అమలు కానుంది. షాపులు దక్కించుకున్న వ్యా పారులు డిసెంబరు ఒకటవ తేదీ నుంచే దుకాణాల్లో మద్యం విక్రయాలు జరిపేందుకు అవకాశం ఉంది.
షాపులకు రిజర్వేషన్లు ఇలా...
జిల్లాలో మద్యం షాపులకు రిజర్వేషన్లు గత మద్యం పాలసీకి భిన్నంగా వివిధ కేటగరీల దమాషానా షాపు లు కేటాయించనున్నారు. జిల్లాలో మొత్తం 73 మద్యం షాపులు ఉండగా మొత్తంగా 30 శాతం రిజర్వేషన్ అ మలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 22 దుకాణాలను వివిధ వర్గాల వారికి రిజర్వు చేయనున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ సామాజిక వర్గాలకు 10, ఎస్టీలకు 05, గౌడ కులస్థులకు గరిష్టంగా 15 శాతం షాపులు రిజర్వు కానున్నాయి. మిగతా 51 షాపులకు ఆయా రిజర్వేషన్ వర్గాలతోపాటు నాన్ రిజర్వు వర్గాలకు చెందిన వ్యాపా రులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. లైసెన్సు రుసుమును ఆరు వాయిదాల పద్దతిలో చెల్లించాల్సి ఉండగా, జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజును స్లాబుల వారీగా చెల్లించవలసి ఉంటుంది. లైసె న్సు ఫీజును గత మద్యం పాలసీ ప్రకారం 5వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మొత్తం 17 షాపులు కేటా యించగా ఒక్కో దుకాణానికి యేడాదికి రూ. 50 లక్షలు గా నిర్ణయించారు. 5వేల నుంచి 50వేల జనాభా గల పట్టణాల్లో 17 షాపులు ఉండగా సాలుసరి ఫీజు రూ. 55 లక్షలు, 50వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాం తాల్లో 38 షాపులు ఉండగా రూ. 60 లక్షలు సాలుసరి లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్క జైపూర్ మండలం ఇందారంలో ఒక షాపు ఉండగా, ఇ క్కడ మాత్రం గరిష్టంగా సాలుసరి లైసెన్సు ఫీజు రూ. 65 లక్షలు నిర్ణయించారు. ఇక్కడ 5వేల లోపు జనాభా ఉన్నప్పటికీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 5 కిలో మీటర్ల లోపు పెరిఫెరి ఉన్నందున ఇక్కడ రూ. 5 లక్షలు అధనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏ డాది కూడా అదే మాదిరిగా ఫీజుల చెల్లింపు ఉండే అవకాశం ఉంది.