Share News

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదు

ABN , Publish Date - Dec 28 , 2025 | 10:47 PM

ప్రజా పోరాటాలు, 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో అధి కారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లే దని, కుంభకోణాలతో కోట్లు కూడగట్టుగున్న మాజీ సీఎం కేసీఆర్‌ పిచ్చి వా గుడు వాగుతున్నాడని టీడీపీ చెన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదు

తెలుగు యువత రాష్ట్ర నాయకుడు సంజయ్‌కుమార్‌

మందమర్రిటౌన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పోరాటాలు, 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో అధి కారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లే దని, కుంభకోణాలతో కోట్లు కూడగట్టుగున్న మాజీ సీఎం కేసీఆర్‌ పిచ్చి వా గుడు వాగుతున్నాడని టీడీపీ చెన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆం ధ్రప్రదేశ్‌ నుంచి రాష్ట్ర విభజన జరిగిన ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రాలు వేరైన తర్వాత మళ్లీ కేసీఆర్‌ తమ నాయకుడు చంద్రబాబునాయుడుపై లేని పోని విమర్శలు చేస్తున్నాడన్నారు. తమ నాయకుడు ఒక విజన్‌ ఉన్న నేత అని, ఆయన పాలనలోనే రాష్ట్రానికి హైటెక్‌ సిటి తదితర అభివృద్ధి జరిగిందన్నారు. కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ చంద్రబాబు నాయుడు పనితీరును చాలా ప్రశంసించింది వాస్తవం కాదా అ న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే కూలిపోతుంటే ఎంత పెద్ద కుం భకోణం జరిగిందో ప్రజలకు తెలిసిందన్నారు. బీఆర్‌ఎస్‌పాలనలో జరిగిన కుంభకోణాల కోసం ఎమ్మెల్సీ కవిత మాట్లాడితే దానికి జవాబులు చెప్పలేక నీళ్లు మింగుతున్నారన్నారు. కేసీఆర్‌ కూతురే అవినీతి గురించి మాట్లాడు తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు పనితీరు బాగు న్నందునే ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమే తెలంగాణలో అధికారంలోకి వ స్తుందన్నారు. తమ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. సమావేశంలో నా యకులు వాసాల సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 10:47 PM