NOTA Votes Outnumber Independents: స్వతంత్రులకంటే నోటాకే అధికం 924 ఓట్లు నమోదు
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:24 AM
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈసారి వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకంటే కూడా నోటా నన్ ఆఫ్ ది ఎబవ్‌కే ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి నెలకొంది...
హైదరాబాద్ సిటీ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈసారి వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకంటే కూడా నోటా(నన్ ఆఫ్ ది ఎబవ్)కే ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకే అత్యధికంగా 924 ఓట్లు రావడం ఆసక్తికరంగా మారింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఓ అభ్యర్థికి మరీ దారుణంగా 9 ఓట్లే రావడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా 2023 సాఽధారణ ఎన్నికల్లో కూడా నోటాకు 1,374 ఓట్లు రావడం గమనార్హం.