Share News

జలం కాదు...గరళం

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:07 PM

మంచిర్యాల జిల్లా కేంధ్రలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా నల్లాల నుంచి సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు బురదమయంగా ఉండటంతో ప్రజలు వినియోగించేందుకు జంకుతున్నారు. నల్లాల నుంచి వస్తున్న నీటిని జలం కంటే గరళంగా పేర్కొంటున్నారు.

జలం కాదు...గరళం

-మున్సిపల్‌ నల్లాల ద్వారా వస్తున్న బురద నీరు

-శుద్ధి చేయకుండానే పైపులైన్ల ద్వారా సరఫరా

-నీటిని వినియోగించేందుకు ప్రజల విముఖత

-మినరల్‌ వాటర్‌ వైపు పరుగులు

-క్లోరినేషన్‌ చేయడంలోనూ నిర్లక్ష్యం

-టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాల భారిన ప్రజలు

మంచిర్యాల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంధ్రలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా నల్లాల నుంచి సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు బురదమయంగా ఉండటంతో ప్రజలు వినియోగించేందుకు జంకుతున్నారు. నల్లాల నుంచి వస్తున్న నీటిని జలం కంటే గరళంగా పేర్కొంటున్నారు. నగర ప్రజలు నీరు మురికిగా ఉండటంతోపాటు దుర్వాసన వస్తుండటంతో మంచి నీటి కోసం మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ల వై పు పరుగులు పెడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నీరు పూర్తిగా మురికిమ యంగా తయారైంది. దీంతో కార్పొరేషన్‌కు సరఫరా అయ్యే మంచినీరు కలుషితమతోంది. సాధారణంగా కా ర్పొరేషన్‌ పరిధిలోని గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని సమీపంలో ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ ప్లాంటులో శుద్ధిచేసి నగర ప్రజలకు తాగునీరుగా అం దిస్తారు. అయితే మిషన్‌ భగీరథ వద్ద ఉన్న ఫిల్టర్‌ బెడ్‌ లో నీటిశుద్ధి ప్రక్రియ సక్రమంగా జరుగక నేరుగా ప్రాజెక్టు నీరే ట్యాంకుల ద్వారా నల్లాలకు సరఫరా అవుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఒక వైపు సీజనల్‌ వ్యాధులతో సతమతవుతున్న ప్రజ లు మురికితో కూడిన తాగునీటి కారణంగా అనారోగ్యాల భారిన పడుతున్నారు.

నీటి శుద్ధికి మంగళం...

ఎల్లంపల్లి ప్రాజెక్టు శుద్ధి చేసిన తర్వాతనే నగరం లోని వివిధ ఏరియాలలో ఉన్న రిజర్వాయర్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే పంప్‌హౌజ్‌లోకి చేరిన నీటిని ఎలాంటి శుద్ధి చేయకుండానే నేరుగా ట్యాంకుల్లోకి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్‌ ద్వారా సరఫరా అవుతున్న నీరు తాగేందుకు కాదుకదా, కనీసం వంట చేయడానికి కూ డా పనికి రాకుండా పోతుందని ప్రజలు వాపోతు న్నా రు. బిందెల్లో పట్టిన నీరు మురికిగా వస్తుండటంతో వృ ధాగా పారబోస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. అసలే అరకొరగా సరఫరా అవుతున్న మంచినీరు ఇలా మురికి గా ఉండటంతో తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

జాడలేని క్లోరినేషన్‌....

మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రజలకు సరఫరా అ వుతున్న నీటిని క్రమంగా తప్పకుండా క్లోరినేషన్‌ చేయా ల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రక్రియ తరుచుగా చేపట్టాలి. అయితే వర్షాకాలం ప్రారంభమై ముగింపు దశకు చేరుకున్నా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇ ప్పటి వరకు క్లోరినేషన్‌ చేసిన పాపాన పోలేదు. కనీసం ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిన దాఖ లాలు కూడా లేవు. దీంతో తాగునీరు అపరిశుభ్రంగా ఉండటంతోపాటు తోక పురుగులు దర్శనమిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. వారం పది రోజులుగా ఇదిలా ఉండగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను సైతం ఎప్పటిక ప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. ఆ ప్రక్రియ కూడా సక్ర మంగా చేపట్టడంలేదని తెలుస్తోంది. కార్పొరేషన్‌లో పా లక వర్గాలు లేకపోవడంతో ప్రజల సమస్యలపై సంబం ధిత అధికారులు పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణ లు ఉన్నాయి. నేరుగా సమస్యలను వారి దృష్టికి తీసుకె ళ్లినా ఫలితం ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంటిల్లిపాది టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నట్లు పలువురు తెలిపారు.

మినరల్‌ వాటర్‌ వైపు పరుగులు....

నల్లాల ద్వారా సరఫరా అయ్యే నీటిని వినియోగించేందుకు ఇష్టపడని ప్రజలు మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. రూ. 20లు వెచ్చించి ప్రతీ రోజూ ఒక మినరల్‌ వాటర్‌ క్యాన్‌ కొనుగోలు చేస్తున్నా మని వారు చెబుతున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నెలవారీ బిల్లు రూ. 150 చెల్లిస్తుండగా, మినరల్‌ వాటర్‌ బిల్లు అధనంగా భరించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. రోజుల తరబడి నల్లాల నుంచి మురికి నీరు వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రజల అవసరాన్ని ఆసరాగా మలుచుకుంటు న్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మురికి నీటి కారణంగా కార్పొరేషన్‌ పరిధిలోని వాటర్‌ ప్లాంటులన్నీ ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.

వ్యాధుల బారిన పడుతున్నాం....పూల మంజుల, గృహిణి

నల్లాల నుంచి వస్తున్న మురికి నీటి కారణంగా వ్యా ధుల భారిన పడాల్సి వస్తోంది. ఇంటిల్లిపాది జ్వరాలతో బాధపడుతున్నాం. నల్లాల నుంచి నిత్యం మురికి నీరు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. బిందెల్లో నిం పిన నీరు డ్రైనేజీ వాటర్‌ను తలపిస్తోంది. దుర్వాసన వస్తుండటంతో నీళ్లు పట్టడం మానివేశాం. పూర్వం నుం చే గోదావరి నీరు తాగడం అలవాటు. అందుకే మినర ల్‌ వాటర్‌ ఉపయోగించడంలేదు. ఇప్పటికైనా అధికా రులు తాగునీటిని శుద్ధిచేసి, సరఫరా చేయాలి.

Updated Date - Sep 09 , 2025 | 11:07 PM