Share News

kumaram bheem asifabad- నమోదు కాక..అమ్ముకోలేక..

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:12 PM

వానాకాలం సీజన్‌లో వర్షాలు, తెగుళ్లను తట్టుకుని సాగు చేసిన రైతన్న.. కాస్తో కూస్తో వచ్చిన దిగుబడులను అమ్ముకుం దా మంటే ఇబ్బందులు తప్పడం లేదు. మొక్కజొన్న పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు విక్ర యించుకుందామంటే అవస్థలు పడాల్సన పరిస్థితి నెలకొ న్నది.

kumaram bheem asifabad- నమోదు కాక..అమ్ముకోలేక..
చేనులో మొక్కజొన్నలు ఆరబోసిన రైతు

జైనూర్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌లో వర్షాలు, తెగుళ్లను తట్టుకుని సాగు చేసిన రైతన్న.. కాస్తో కూస్తో వచ్చిన దిగుబడులను అమ్ముకుం దా మంటే ఇబ్బందులు తప్పడం లేదు. మొక్కజొన్న పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు విక్ర యించుకుందామంటే అవస్థలు పడాల్సన పరిస్థితి నెలకొ న్నది. ఈ క్రాప్‌ పంట వివరాల నమోదులో పేర్లు లేకపోవడంతో పాటు తక్కువ సాగు విస్తీర్ణం ఉండ డం తో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించ లేకపోతు న్నారు. ప్రైవేటుకు కట్ట బెట్టాల్సిన దుస్థితి రైతులది.

- సుమారు 57 వేల ఎకరాల్లో

జిల్లాలో ఈ వానాకాలంలో సుమారు 57 వేల ఎకరా ల్లో మొక్క జొన్న సాగుచేస్తున్నట్లు అధికారుల అంచనా. ఎకరానికి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావిస్తున్నా రు. పంటను కనీస మద్దతు ధర (రూ. 2500)కు అమ్ముకొవాలంటే వ్యవసాయశాఖ ఈ క్రాప్‌ యాప్‌లో పంట వివరాలు నమోదై ఉండాలి. జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ క్రాప్‌ యాప్‌ నమోదులో తక్కువగా కనిపి స్తోంది. గత ఏడాది జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయలేదు. దీని వల్ల ఈ ఏడాదిలో చాల మంది రైతులు ఈ క్రాప్‌లో పంట నమోదు చేయించ లేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పేరు నమోదై ఉంటేనే పంటలు కొనుగోలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ నిబంధనల ప్రకారం ఒక్కో రైతు నుంచి ఎకరానికి 18.5 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నా రు. మిగిలిన దిగుబడులను అమ్ముకునేందుకు అన్నదాత లు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఆన్‌లైన్‌లో పేరు నమోదు లేని అన్నదాతను, ముఖ్యంగా కౌలుదా రులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కవుతున్నారు. తక్కువ ధరలకు విక్రయిస్తూ నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు..

పూర్క బాపురావ్‌, రైతు, రాసిమెట్ట

మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వ మార్క్‌ఫెడ్‌ కేం ద్రాల్లో సిబ్బంది 18.5 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటా మని చెబుతున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తే తక్కువ ధరకే తీసుకుంటున్నారు. ప్రభుత్వమే పూర్తి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.

కౌలు రైతులను పట్టించుకోవాలి..

హండె బాగ్‌ మనోహర్‌, రైతు, జామ్ని

ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోవాలి. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకోని మొక్కజొన్న సాగు చేశాను. ఈ క్రాప్‌లో పంట నమోదు చేయలేక పోయాం. పంట అమ్ము కుందామంటే ఆన్‌లైన్‌లో పేరు అడుగుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తే పెట్టుబడుల సైతం వచ్చేలా లేవు. ప్రభుత్వం ఆదుకోవాలి.

Updated Date - Nov 15 , 2025 | 11:12 PM