Share News

kumaram bheem asifabad-రెండో విడతకు నామినేషన్లు

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:00 PM

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట మండలాల్లోని 113 సర్పంచ్‌ స్థానాలకు, 992 వార్డు స్థానాలకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు.

kumaram bheem asifabad-రెండో విడతకు నామినేషన్లు
సిర్పూర్‌(టి)లో నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ

ఆసిఫాబాద్‌/సిర్పూర్‌(టి)/బెజ్జూరు/దహెగాం/కౌటాల/చింతలమానేపల్లి(కౌటాల), నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట మండలాల్లోని 113 సర్పంచ్‌ స్థానాలకు, 992 వార్డు స్థానాలకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. మొదటి రోజు ఆయా మండలాల్లో సర్పంచ్‌ స్థానాలకు 29, వార్డు స్థానాలకు 35 నామినేషన్లు దాఖలు అయ్యాయి. సిర్పూర్‌(టి) మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు రెండో విడత జరుగున్న ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం అయింది. మొదటి రోజు మండల వ్యాప్తంగా సర్పంచ్‌ స్థానాలకు 2, వార్డు సభ్యులకు 1 నామినేషన్‌ దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండలంలోని చీలపల్లిలో సర్పంచ్‌ స్థానానికి 1, వెంపల్లిలో సర్పంచ స్థానానికి 1, సిర్పూర్‌(టి) వార్డు స్థానానిక 1 నామినేషన్‌ వచ్చినట్లు తెలిపారు. కాగా నామినేషన కేంద్రాన్ని జడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ ఆదివారం పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రహీముద్దీన్‌, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ వినోద్‌, ఈఓ తిరుపతి తదితరులు ఉన్నారు. బెజ్జూరు మండలంలో సర్పంచ స్థానాలకు 5, వార్డు సభ్యుల స్థానాలకు 12 నామినేషన్‌లు దాఖలు అయినట్లు ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మండలంలో 22 గ్రామ పంచాయతీలు, 188 వార్డు స్థానాలు ఉండగా సర్పంచ్‌ స్థానాలకు 5, వార్డు సభ్యుల స్థానాలకు 12 నామినేషన్‌లు వచ్చినట్లు తెలిపారు. దహెగాం మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు 19 నామినేషన్‌లు దాఖలు అయినట్లు ఎంపీడీఓ నస్రుల్లాఖాన్‌ ఆదివరాం తెలిపారు. సర్పంచ్‌ స్థానాలకు 9, వార్డు సభ్యుల స్థానాలకు 10 వచ్చినట్లు తెలిపారు. మండలంలో 24 గ్రామ పంచాయతీలు, 200 వార్డు సభ్యులు ఉన్నాయి. కౌటాల మండలంలో రెండో విడతలో మొదటి రోజు సర్పంచ్‌ స్థానానికి 6, వార్డు స్థానాలకు 6 దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండ లంలోని గుడ్లబోరి, గుండాయిపేట, ముత్యంపేట, శిర్సా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు ఒకటి చొప్పున, తలోడిలో సర్పంచ్‌ స్థానానికి 2 నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. అలాగే వార్డు సాథనాలకు కౌటాలలో 2, ముత్యంపేటలో 3, తలోడిలో 1 నామినేషన దాఖలు అయ్యాయి. చింతలమానేపల్లి మండలంలో సర్పంచ్‌ స్థానానికి రెండు, వార్డు స్థానాలకు 2 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గంగాపూర్‌ సర్పంచ్‌ స్థానానికి 1, కర్జెల్లి సర్పంచ స్థానానికి 1 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు బాలాజీ అనుకోడలో 1, రవీంద్రనగర్‌-1లో 1 నామినేషన్‌ దాఖలు అయ్యాయి.

Updated Date - Nov 30 , 2025 | 11:00 PM