Nobel Laureate Abhijit Banerjee: తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు నోబెల్ గ్రహీత అభిజీత్ బెనర్జీ!
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:43 AM
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించనుంది...
ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు దువ్వూరి సుబ్బారావు, రఘురామ్ రాజన్
వివిధ రంగాల ప్రముఖలను ఆహ్వానించనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించనుంది. ఇందులో భాగంగా ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజీత్ బెనర్జీని సమ్మిట్‌కు ఆహ్వానిస్తుంది. అలాగే, ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు దువ్వూరి సుబ్బారావు, రఘురామ్ రాజన్, బయోకాన్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా, కేంద్ర ప్రభుత్వం మాజీ ఆర్థిక ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, రామన్ మెగసెసె అవార్డు విజేత విల్సన్, ప్రముఖ ఆర్థికవేత్త సంతోష్ మెహరోత్రా, ప్రముఖ పర్యావేరణ శాస్త్రవేత్త అరుణభా ఘోష్, ఐక్యరాజ్యసమితి సలహామండలి సభ్యులు జయతి ఘోష్‌లను కూడా ఆహ్వానిస్తుంది. డిసెంబరు 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం విజన్-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేయనుంది. కాగా, తెలంగాణ సమగ్రాభివృద్ధికి కావాల్సిన సూచనలు, సలహాల కోసం ప్రభుత్వం నిపుణులతో ఓ సలహామండలిని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.