Share News

గిరిజన భూములకు రక్షణ ఏదీ...?

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:11 PM

దండే పల్లి మండలం ముత్యంపేట గ్రామంలో కబ్జాకు గురైన గిరిజన (ఏజెన్సీ) భూములను తిరిగి స్వాధీనం చేసుకో వడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. కబ్జాకు గురైన గిరిజన భూములను తక్షణమే కస్టడీలో కి తీసుకోవాలన్న ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఖుష్బూ గుప్త ఆదేశాలను కూడా రెవెన్యూ అధికారు లు ఖాతరు చేయకపోవడం కొసమెరుపు.

గిరిజన భూములకు రక్షణ ఏదీ...?

-గుట్టుచప్పుడు కాకుండా కబ్జా

-స్వాధీనపరుచుకోలేకపోతున్న అధికారులు

ఏడు నెలలు గడుస్తున్నా ముందుకు సాగని ప్రక్రియ

ఐటీడీఏ పీవో ఆదేశాలూ బేఖాతర్‌

అధికారుల వైఖరిపై కలెక్టర్‌కు గ్రామస్థుల ఫిర్యాదు

మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): దండే పల్లి మండలం ముత్యంపేట గ్రామంలో కబ్జాకు గురైన గిరిజన (ఏజెన్సీ) భూములను తిరిగి స్వాధీనం చేసుకో వడంలో రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. కబ్జాకు గురైన గిరిజన భూములను తక్షణమే కస్టడీలో కి తీసుకోవాలన్న ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఖుష్బూ గుప్త ఆదేశాలను కూడా రెవెన్యూ అధికారు లు ఖాతరు చేయకపోవడం కొసమెరుపు. భూముల క బ్జా విషయం వెలుగులోకి వచ్చి ఏడు నెలలు గడుస్తు న్నా రక్షణ చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారు లు వెనుకడుగు వేస్తుండటంతో అనుమానాలు రేకెత్తు తున్నాయి. భూములను కబ్జా చేసిన వారికి రాజకీయ నాయకుల పరోక్ష మద్దతు ఉండబట్టే అధికారులు స్పం దించడం లేదనే ప్రచారం సాగుతోంది. దీంతో గిరిజన భూముల రక్షణ గాల్లో దీపం మాదిరిగా తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, వాటికి రక్షణ కల్పిస్తారని ప్ర జలు ఎదురు చూస్తుండగా, అధికారుల నుంచి ఎలాం టి స్పందన లేకపోవడంతో గ్రామానికి చెందిన కొండ నరేష్‌ అనే యువకుడు ఈ నెల 16వ తేదీన కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు ఫిర్యాదు చేశారు.

అక్రమంగా రైస్‌ మిల్లు ఏర్పాటు...

ముత్యంపేట గ్రామంలోని గిరిజన భూములను క బ్జా చేసిన వ్యాపారి ఒకరు అందులో అక్రమంగా రైస్‌ మిల్లు కూడా ఏర్పాటు చేశాడు. గ్రామం పూర్తిగా ఏజె న్సీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గిరిజన చట్టాలైన 1/70, పేసా చట్టాలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ గిరి జనేతరులైన ఇద్దరు బడా వ్యక్తులు గిరిజనుల భూము లను కబ్జా చేశారు. సర్వే నెంబరు 17లో 34 గుంటలతో పాటు దాని సమీపంలోని సర్వే నెంబరు 18లో మరో ఆరు గుంటల భూమిని అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకున్నారు. పైగా ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం గ్రామ పంచాయతీ ట్రేడ్‌ లైసెన్స్‌ కూడా పొం దకుండా మినీ రైస్‌మిల్లు ఏర్పాటు చేయడం గమనా ర్హం. ఇదిలా ఉండగా అదే భూమిని ఉట్నూరులోని ఐటీ డీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఇళ్లు లేని పలువురు గిరిజనులకు ఇంటి స్థలాల కోసం కేటాయిస్తూ గతంలో ఆదేశాలు జారీ చేశారు. పీవో ఆదేశాల మేరకు భూమిని ఇళ్లు లే ని పేదలకు పంచాల్సి ఉండగా, స్థానిక రెవెన్యూ అధి కారుల నిర్లక్ష్యం కారణంగా అవి అన్యాక్రాంతం అయ్యా యి. గిరిజన భూముల కబ్జా విషయం ‘ఆంధ్రజ్యోతి’ దృ ష్టికి రావడంతో ‘ఏజెన్సీ భూమి కబ్జా’ శీర్షికన నవంబరు 12న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్పందించిన ఐటీ డీఏ పీవో మరునాడు దండేపల్లి తహసీల్దార్‌కు సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు ఇదే విషయమై గ్రామస్థుల నుంచి ఫిర్యాదు స్వీక రించిన కలెక్టర్‌ సైతం అక్రమంగా రైస్‌ మిల్లు ఏర్పాటు చేసిన స్థలంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని న వంబరు 26వ తేదీన అదనపు కలెక్టర్‌ ద్వారా తహసీ ల్దార్‌ను ఆదేశించారు. అడిషనల్‌ కలెక్టర్‌ ఇచ్చిన గడువు ముగియడం, రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టకపోవ డంతో గిరిజనులు డిసెంబరు 11న ఉట్నూరు ఐటీడీఏ పీవోను కలిసి ఏజెన్సీ భూమిని కాపాడాలని ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పీవో భూములను స్వా ధీనం చేసుకోవాలని తహసీల్దార్‌కు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు.

సర్వే జరిపిన యంత్రాంగం....

ఓ వైపు కలెక్టర్‌, మరోవైపు ఐటీడీఏ పీవో ఆదేశాలు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మండల రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. జనవరి 2న మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భూమన్న, సర్వేయర్‌ వినోద్‌, సద రు భూముల్లో సర్వే జరిపారు. విచారణలో సర్వే నెం బరు 17లో మొత్తం 1.12 ఎకరాల ఏజెన్సీ భూములు కబ్జాకు గురైనట్లు అధికారులు నిర్దారించారు. అందులో గతంలో గిరిజనులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన 34 గుంటల భూమి కూడా ఉన్నట్లు తేల్చి, బౌండరీలు ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైన 34 గుంటల్లో 10 గుం టలతోపాటు దాని పక్కనే ఉన్న సర్వే నెంబరు 18లో నూ మరో 6 గుంటలు అక్రమంగా చేజిక్కించుకున్న వ్యాపారి ఆ మొత్తం స్థలంలో రైస్‌ మిల్లును నిర్మించా డు. భూముల సర్వే పూర్తికావడంతో సంబంధిత నివేది కను తహసీల్దార్‌ ఐటీడీఏ పీవోకు అందజేశారు. దీంతో స్పందించిన ఐటీడీఏ పీవో కబ్జాకు గురైన ఏజెన్సీ భూ మిని ప్రభుత్వ కస్టడికి తీసుకోవాలంటూ ఫిబ్రవరి 6న తహసీల్దార్‌కు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. భూమిని స్వాధీనం చేసుకొనే క్రమంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

ముందుకు సాగని ప్రక్రియ....

స్థలాన్ని కస్టడీకి తీసుకోవాలన్న ఐటీడీఏ పీవో ఆదేశా లను అధికారులు బుట్టదాఖలు చేశారు. ఏడు నెలలు గడుస్తున్నా భూములను స్వాధీనం చేసుకోవడంలో అ డుగులు ముందుకు పడలేదు. దీంతో అధికారుల వైఖ రిపట్ల విసుగు చెందిన గ్రామస్థులు నాలుగు రోజుల క్రితం తిరిగి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా మండల రెవెన్యూ అఽధికారులు స్పందించి కబ్జాకు గు రైన గిరిజనుల భూములను స్వాధీనం చేసుకుం టారా...? లేదా...? అని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:11 PM