No Parking on ORR: ఔటర్‌పై ఒక్క క్షణం ఆగినా ప్రాణాంతకమే!
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:40 AM
ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలను అరికట్టేందుకు ‘ఔటర్‌పై నో పార్కింగ్’ అంటూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్..
ప్రమాదాల నివారణకు ‘నో పార్కింగ్’ ప్రచారం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై ప్రమాదాలను అరికట్టేందుకు ‘ఔటర్‌పై నో పార్కింగ్’ అంటూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ప్రచారం చేపట్టింది. గురువారం ఈ ప్రచార పోస్టర్లను సీజీఎం పరంజ్యోతి, జీఎంలు చంద్రశేఖర్, రమే్‌షకుమార్, ‘ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే’ సంస్థ డైరెక్టర్ చాంద్‌బాషా ఆవిష్కరించారు. పరంజ్యోతి మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్‌పై అక్రమంగా పార్క్ చేసిన వాహనాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఓఆర్‌ఆర్‌పై ఒక్క క్షణం ఆగినా అది ప్రాణాంతకమవుతుందని హెచ్చరించారు. దీనిపై వాహనదారులకు అవగాహన పెంచేందుకు ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే సంస్థ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రచారం చేస్తున్నామన్నారు. నెల పాటు ఈ ప్రచారం నిర్వహిస్తామన్నారు. లాజిస్టిక్ సంస్థల నిర్వాహకులు, డ్రైవర్లు, ప్రైవేటు వాహన యజమానులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చాంద్‌బాషా తెలిపారు. ప్రచారంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలూ భాగస్వాములవుతాయని చెప్పారు. ఓఆర్‌ఆర్‌పైకి వాహనాలు వెళ్లడానికి ముందే ఇంటర్‌ఛేంజ్‌ల్లో ‘నో పార్కింగ్ ఆన్ ఓఆర్‌ఆర్’, ‘నో ఫ్యూయెల్ ఆన్ ఓఆర్‌ఆర్’ అనే ఫ్లెక్సీలను ప్రదర్శిస్తారని తెలిపారు.