Share News

అనారోగ్యంతో ఎవరూ బాధపడొద్దు

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:05 PM

నల్లమలలో ఎవరూ అనార్యోగంతో బాధప డవద్దు, ప్రతీ ఒక్కరికి ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందిస్తామని ఎమ్మెల్యేడాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

అనారోగ్యంతో ఎవరూ బాధపడొద్దు
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు

- వైద్య శిబిరంలో ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యో తి) : నల్లమలలో ఎవరూ అనార్యోగంతో బాధప డవద్దు, ప్రతీ ఒక్కరికి ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందిస్తామని ఎమ్మెల్యేడాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. 3వ మెగా సర్జికల్‌ క్యాంపులో భాగంగా మిగిలిన వారికి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు సర్జరీలు చేశారు. డీసీహెచ్‌ డాక్టర్‌ రామ కృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభు, వైద్యులు శ్రీనివాసులు, మహేష్‌, బిక్కు లాల్‌, బాల్‌సింగ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ అచ్చంపేట : సీజనల్‌ వ్యాధుల ప్రబల కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కా ర్యాలయంలో పంచాయతీ కా ర్యదర్శులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీవో మ ధుసూదన్‌ గౌడ్‌తో కలిసి మాట్లాడారు.

కాంగ్రెస్‌లో చేరిక

అచ్చంపేటరూరల్‌ : అ చ్చంపేట మండల కిష్టతండా, బాల్యతండాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నా యకులు, కా ర్యకర్తలు సుమారు 50 మంది స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ స మక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చే రారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఫ పదర : మండలంలోని కండ్లకుంట్ల గ్రా మానికి చెందిన పది కుటుంబాల బీఆర్‌ఎస్‌ నా యకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో వారంతా ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాం గ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండ ల అధ్యక్షుడు ఏఆర్‌ యాదవ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ పోషం గణేష్‌, మాజీ సర్పంచ్‌ ప్రేమ్‌, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షర్పుద్దీన్‌, సింగి ల్‌విండో డైరెక్టర్‌ రమేష్‌ యాదవ్‌, నాయకులు పెద్దిరాజు యాదవ్‌, పవన్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 11:05 PM