ఎరువుల పంపిణీలో అలసత్వం వద్దు
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:17 PM
మండల కేంద్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘంలో యూరియా లభ్య త, సరఫరాను మంగళవారం కలె క్టర్ బదావత్ సంతోష్ పర్యవేక్షిం చారు.
- యూరియాను ఒకే చోట నిల్వ చేయడంపై కలెక్టర్ ఆగ్రహం
పెద్దకొత్తపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రం లోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘంలో యూరియా లభ్య త, సరఫరాను మంగళవారం కలె క్టర్ బదావత్ సంతోష్ పర్యవేక్షిం చారు. యూరియా కొరత లేకుండా రైతులందరికీ అందేలా చూడాలని, అవసరమైతే ఉదయం 6గంటల నుంచే అమ్మ కాలు ప్రారంభించాలని సింగిల్‌విండో అధికారు లను ఆదేశించారు. కృత్రిమకొరత సృష్టించ వద్ద ని ఆయన హెచ్చరించారు. పెద్దకొత్తపల్లి వ్యవ సాయ కేంద్రంలో యూరియాను ఒకే దగ్గర డంపు చేయడంపై సంబంధిత అధికారులపై క లెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట పెద్దకొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, మండ ల వ్యవసాయ అధికారి శిరీష, సీఈవో సిరాజు ద్దీన్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
మండలంలోని సాతాపూర్ గ్రామంలో మహి ళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను మంగళవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ నమోదు విధానం, తూకం ప్రక్రియపై ఆరా తీశారు. కొనుగోలు చేసిన వరికి సంబంధించిన చెల్లింపు లు సకాలంలో రైతుల ఖాతాల్లో 48 గంటల్లో జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించా రు. కలెక్టర్ వెంట పెద్దకొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి శిరీష, డీపీఎం కృష్ణయ్య, ఏపీఎం సంతోష్, కమి టీ మెంబరు అరుణమ్మ, చంద్రకళ, సీసీ బాల చందర్ పాల్గొన్నారు.