High Security Registration Plates: నంబర్ ప్లేట్ల మార్పుపై ఆందోళన వద్దు
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:30 AM
నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాత వాహనాలకు...
బిగింపునకు గడువు విధించలేదు: రవాణా శాఖ
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : నంబరు ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్‌ఎ్‌సఆర్‌పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువు విధించలేదని వెల్లడించారు. సెప్టెంబరు 30లోగా హెచ్‌ఎ్‌సఆర్‌పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని.. లేదంటే ఆర్టీఏ అఽధికారులు, ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు తెలిపారు. వాహనాలకు నంబరు ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని పేర్కొన్నారు.