Venkata Subbareddy: చెరువులో దూకి నిట్ ప్రొఫెసర్ ఆత్మహత్య
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:26 AM
మానసిక సమస్యతో నిట్ ప్రొఫెసర్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్‌కు చెందిన వెంకట సుబ్బారెడ్డి...
వరంగల్ క్రైం, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మానసిక సమస్యతో నిట్ ప్రొఫెసర్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్‌కు చెందిన వెంకట సుబ్బారెడ్డి(43) వరంగల్ నిట్‌లో 2012 నుంచి అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా మానసిక వ్యాధితో నిద్రపట్టకపోవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిద్ర కోసం మాత్రలు కూడా వాడుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది శుక్రవారం ఉదయం నిట్ కళాశాల నుంచి బైక్‌పై ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. చెప్పులు, వాహనం, సెల్‌ఫోన్ అక్కడే వదిలేసి చెరువులో దూకారు. రిజర్వాయర్ దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి మృతదేహాన్ని వెలికితీశారు.