Share News

NHRC: తీన్మార్‌ మల్లన్నపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Aug 08 , 2025 | 04:12 AM

గత నెలలో ఒక సమావేశంలో జాగృతి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్‌

NHRC: తీన్మార్‌ మల్లన్నపై చర్యలు తీసుకోండి

  • డీజీపీ, ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): గత నెలలో ఒక సమావేశంలో జాగృతి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్‌ (తీన్మార్‌ మల్లన్న)పై చర్యలు తీసుకోవాలని డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ అనుచిత వ్యాఖ్యలపై హైదరాబాద్‌కు చెందిన కారుపోతుల రేవంత్‌ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు.


దీంతో విచారణ చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. మహిళా ఎమ్మెల్సీపై అనాలోచితంగా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తీన్మార్‌ మల్లన్నపై చర్యలు తీసుకుని, నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని గురువారం డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Aug 08 , 2025 | 04:12 AM