Newly Assigned RTC Bus Driver: పది రోజుల క్రితమే ఈ బస్సుకు డ్రైవర్‌గా చేరి!
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:52 AM
ప్రమాదానికి గురైన ఆర్టీసీ అద్దె బస్సు తాండూరులో సోమవారం ఉదయం 4.40గంటలకు బయలుదేరింది. నాలుగేళ్లుగా తాండూరు డిపో పరిధిలో...
ప్రమాదంలో మృత్యువాత పడ్డ దస్తగిరి బాబా
గతంలో బస్సు బ్రేకులు ఫెయిలైనా చాకచక్యంగా
నడిపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన దస్తగిరి
తాండూరు/బషీరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ప్రమాదానికి గురైన ఆర్టీసీ అద్దె బస్సు తాండూరులో సోమవారం ఉదయం 4.40గంటలకు బయలుదేరింది. నాలుగేళ్లుగా తాండూరు డిపో పరిధిలో నడుస్తున్న ఈ అద్దె బస్సుకు బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా(45) డ్రైవర్‌గా ఉన్నారు. అతడి కుటుంబం 20 ఏళ్లుగా తాండూరులో నివాసం ఉంటోంది. మొదట్లో దస్తగిరి బాబా టిప్పర్ లారీ డ్రైవర్‌గా పని చేశారు. ఐదేళ్లుగా ఆర్టీసీ పరిధిలోని అద్దె బస్సులను నడుపుతున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బస్సుకు డ్రైవర్‌గా పది రోజుల క్రితమే చేరారు. సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. గతంలో వికారాబాద్ వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ అయినప్పటికీ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులు కాపాడిన అనుభవం దస్తగిరికి ఉంది.