Share News

ఎస్టీపీపీలో కొత్త యూనిట్‌...

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:37 PM

జిల్లాలోని జైపూర్‌ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఎస్టీపీపీ)లో మరో యూనిట్‌ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఎస్టీపీపీలో కొత్త యూనిట్‌...

-ప్రస్తుతం 1200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

-మరో 800 మెగావాట్ల యూనిట్‌కు సింగరేణి సన్నద్ధం

-రూ.6,700 కోట్లతో బీహెచ్‌ఈఎల్‌తో సంస్థ ఒప్పందం

-40 నెలల్లో అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ

-ప్లాంటు విస్తరణతో కొత్త ఉద్యోగాలకు అవకాశం

మంచిర్యాల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జైపూర్‌ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఎస్టీపీపీ)లో మరో యూనిట్‌ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ 2016 జనవరిలో విద్యుత్‌ ఉత్పతి వైపు దృష్టి సారించింది. ఇందులో భాగంగా సొంత అవసరాలతో పాటు వ్యా పార దృష్టితో మొదట 600 మెగావాట్ల విద్యుత్‌ ఉ త్పత్తిని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అన తికాలంలోనే మరో 600 యూనిట్లను విస్తరించి మొ త్తం 1200 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తిని సాధిస్తోంది. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరాలో ఎస్టీపీపీ ప్రధాన పాత్రను పోషిస్తోంది. తాను ఉత్పత్తి చేస్తు న్న విద్యుత్‌ నుంచి సంస్థ 150 మెగావాట్లు మాత్ర మే వినియోగించుకుంటుండగా, మిగితా 1050 మె గావాట్ల విద్యుత్‌ను జెన్‌కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయిస్తోంది.

అందుబాటులో వనరులు...

విద్యుత్‌ ఉత్పత్తిని సాధించడం కోసం ప్రధానంగా అవసరమైన బొగ్గు, నీరు అందుబాటులో ఉండటం తో ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా, సుమారుగా రెండు వేల ఎకరాల భూములను సంస్థ రైతుల నుంచిసే కరించింది. 2015 సంత్సరాంతంలో విద్యుత్‌ ఉత్ప త్తిని సాధించాలనే లక్ష్యంతో 2011లో కాంట్రాక్టు అ వార్డు చేయడంతో పాటు 2012లో అభివృద్ధి పనుల ను సంస్థ ప్రారంభించింది. రూ.7573 కోట్ల అంచనా వ్యయంతో (రెండు యూనిట్లు) 1200 మెగావాట్ల వి ద్యుత్‌ ప్లాంట్‌ పనులు పూర్తి చేయగా మరో రూ. 6,700 కోట్ల అంచనా వ్యయంతో మూడో యూనిట్‌ 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే లక్ష్యంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

గోదావరి నీరు తరలింపు....

మొట్ట మొదటిసారిగా విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టిన పెగడపల్లి సింగరేణి పవర్‌ ప్రాజెక్టుకు అవ సరమైన 3 టీఎంసీల నీటిని గోదావరి, ప్రాణహిత నదుల నుంచి తరలిస్తూ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. గోదావరి నది నుంచిషెట్‌పల్లి, గంగిపల్లి, ఎల్కంటి, పెగడపల్లి శివారుల మీదుగా ప్లాంట్‌ ఆవరణలో ని ర్మించిన రిజర్వాయర్‌ వరకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్నారు. మిగితా 2 టీఎంసీల నీటిని కోటపల్లి మండలం దేవులవాడ శివారు ప్రాణహిత నది నుంచితరలించడం కోసం ఏర్పాట్లు చేశారు. అ లాగే విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమై బొగ్గును శ్రీరాం పూర్‌ ఓపెన్‌కాస్టు నుంచి తరలించేందుకు సంస్థ ప్రత్యేక రైలుమార్గాన్ని కూడా ఏర్పాటు చేసింది.

ఇప్పటికే పూర్తయిన టెండర్‌ ప్రక్రియ...

ఎస్టీపీపీలో మూడో యూనిట్‌ ఏర్పాటు చేసేందు కు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే 1200 మెగావాట్ల ఉత్పత్తిజరుగుతుండగా, వంద శా తం ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఏఎల్‌ఎఫ్‌) సాధిస్తూ దేశవ్యాప్త రికార్డులు సృష్టిస్తోంది. గత ఐదు సంవత్స రాల్లో ఏకంగా 60వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ను ఉత్పత్తి చేసి రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా చేసింది. త్వ రలో మూడో యూనిట్‌ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతుండగా, ఈ మేరకు సింగరేణి హైద్రాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ సంస్థతో ఇటీవల ఒప్పం దం పూర్తి చేసుకుంది. గత ఫిబ్రవరిలోనే ఈ కాంట్రాక్ట్‌ను బీహెచ్‌ ఈఎల్‌ దక్కించుకోగా, అగ్రిమెంట్‌ పూర్తయిన నాటి నుంచి నాలుగే ళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. అయితే అందుకు భిన్నంగా కే వలం 40 నెలల్లోనే ప్లాంట్‌ను అందుబాటులోకి తేవాలని యాజ మాన్యం సన్నాహాలు చేస్తోంది.

ఫకొత్త ఉద్యోగాలకు అవకాశం..

ఎస్టీపీపీలో మరో యూనిట్‌ను విస్తరిస్తుండగా, నిరుద్యోగ యువ తకు ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఇప్పటికే సంస్థలో సుమారు రెండు వేల వరకు శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు పని చే స్తుండగా, మూడో యూనిట్‌ అవసరమైన మరో 1200 వరకు కొత్త ఉద్యోగాలు కల్పించనున్నారు. దీంతో ఉద్యోగావకాశాలు మెరుగు పడ గా, నూతనంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కూడా రాష్ట్ర అవసరాలకు విక్రయించనుంది.

ఫడిప్యూటీ సీఎంచే శంకుస్థాపన..?

ఎస్టీపీపీలో ఏర్పాటు చేయదలిచిన మూడో యూనిట్‌ విద్యుత్‌ ఉ త్పత్తి పనులకు త్వరలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మం త్రి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి గత సంవ త్సరం మార్చి 12న హైద్రాబాద్‌లో ప్రకటించారు. అయితే నూతన ప్లాంట్‌ ఏర్పాటుకు అగ్రిమెంట్‌ పూర్తికావడంతో త్వరలో శంకుస్థాప న చేయనుం డగా, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Mar 16 , 2025 | 10:37 PM