Share News

మెప్మా రుణాలపై కొత్త మెలిక...

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:01 PM

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) లింకేజీ విషయం లో బ్యాంకర్లు కొత్త మెలిక పెట్టారు. ఎస్‌హెచ్‌జీ ద్వారా రుణం తీసుకొనే ప్రతీ మహిళ ఉద్యమ్‌ ఆధార్‌ తప్పని సరిగా కలిగి ఉండాలని చెబుతుండటంతో సభ్యులంద రూ అయోమయానికి గురవుతున్నారు.

మెప్మా రుణాలపై కొత్త మెలిక...

-రుణం పొందే ప్రతీ మహిళకు ఉద్యమ్‌ ఆధార్‌ తప్పనిసరి

-కార్డు పొందడంలో ఎస్‌హెచ్‌జీ సభ్యుల ఇబ్బందులు

-పాన్‌, ఆధార్‌తో అనుసంధానమై ఉండాలన్న నిబంధన

-ఆన్‌లైన్‌ సెంటర్ల వెంట మహిళల ప్రదక్షిణ

మంచిర్యాల, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) లింకేజీ విషయం లో బ్యాంకర్లు కొత్త మెలిక పెట్టారు. ఎస్‌హెచ్‌జీ ద్వారా రుణం తీసుకొనే ప్రతీ మహిళ ఉద్యమ్‌ ఆధార్‌ తప్పని సరిగా కలిగి ఉండాలని చెబుతుండటంతో సభ్యులంద రూ అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి రావడంతో ఆన్‌లైన్‌ సెం టర్ల వైపు పరుగులు పెడుతున్నారు. సాఽధారణంగా చి న్న తరహా పరిశ్రమలు స్థాపించేవారు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడానికి ఉద్యమ్‌ ఆధార్‌ తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుందని బ్యాంకర్లు చె బుతున్నాయి. అయితే ఉద్యమ్‌ ఆధార్‌ను ప్రభుత్వ రు ణంతో స్వయం ఉపాధి పొందే సంఘాలకు కూడా వ ర్తింపజేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఎస్‌హెచ్‌సీ సభ్యులు ఉద్యమ్‌ ఆధార్‌ కార్డు తీసుకోవడం ఇబ్బందిగా మారిం ది. సంఘం తరుఫున కనిష్టంగా లక్ష రూపాయల నుం చి గరిష్టంగా రూ. 20 లక్షల వరకు రుణం తీసుకునే వారందరూ ఉద్యమ్‌ ఆధార్‌ ధృవీకరణ పత్రం జత చే యాలన్న నిబంధన విధించడంతో తీవ్ర అయోమ యానికి గురవుతున్నారు.

ఉద్యమ్‌ ఆధార్‌ అంటే...?

ఇది భారత దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ఉద్దేశించిన కాగిత రహిత ఆన్‌లెన్‌ రి జిస్ట్రేషన్‌ ప్రక్రియ. ఈ రిజిస్ట్రేషన్‌ అనంతరం ఒక ప్ర త్యేకమైన పన్నెండు అంకెల సంఖ్య లభిస్తుంది. ఈ రి జిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ పొందడం ద్వారా వ్యాపారాలకు సం బంధించి తక్కువ వడ్డీకి రుణాల మంజూరుతో పాటు ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందుతా యి. 2020లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.

నిబంధనలు ఇవీ...

ఉద్యమ్‌ ఆధార్‌ కార్డు తీసుకోవాలంటే రుణం పొం దగోరే మహిళ మొదట పాన్‌కార్డు కలిగి ఉండాలి. అది ఆధార్‌కార్డుతో కచ్చితంగా అనుసంధానమై ఉండాలి. రు ణం తీసుకునే మహిళలు ఏదో ఒక వ్యాపారం నడుపు తున్నట్లు ట్రేడ్‌ లైసెన్స్‌ వంటి డాక్యుమెంట్‌ తీసుకోవాలి. పైవన్నీ జత చేస్తేనే ఉద్యమ్‌ ఆధార్‌ పత్రాన్ని తీసుకు నేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో చాలా మంది ఎస్‌హెచ్‌సీ సభ్యులకు పాన్‌ కార్డులు లేవు. అవి కలిగి ఉన్నవారు ఆధార్‌తో దాన్ని అనుసంధానం చేసుకోలేదు. ఇప్పటి వరకు ఆ అవసరం కూడా వారికి ఏర్పడలేదు. ప్రస్తుతం రుణాలు అవసరం కనుక ఇప్పటికిప్పుడు పా న్‌, ఆధార్‌తో లింకు చేయించుకోవాలన్నా కనీసం 15 రో జుల సమయం పడుతుంది. అలాగే ఆన్‌లైన్‌ సెంటర్ల లో రూ. 1500 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మ రోవైపు పాన్‌, ఆధార్‌ కార్డుల్లోని పేర్లలో ఏ చిన్న తప్పు దొర్లినా మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఈ ప్రక్రియ అం తా మెప్మా సభ్యులకు భారంగా, కష్టతరంగా మారిం ది. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకునే అవకాశం లే కుండా పోతుందనే ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి.

ఉద్యమ్‌ ఆధార్‌ నమోదు ఇలా...

మొదట అధికారిక ప్రభుత్వ ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ జ్ట్టిఞట://ఠఛీడ్చఝట్ఛజజీట్టట్చ్టజీౌుఽ.జౌఠి.జీుఽ/ లో కి వెళ్లాలి. ’ఎంఎస్‌ఎంగా ఇప్పటి వరకు నమోదు చేసు కోని కొత్త వ్యవస్థాపకులు లేదా ఈఎం-2 ఉన్నవారి కోసం’ అన్న దానిపై క్లిక్‌ చేయాలి. ఆధార్‌ కార్డులో ఉ న్న విధంగా ఆధార్‌ నెంబర్‌, వ్యవస్థాపకుని పేరు న మోదు చేయాలి. తర్వాత వ్యాలిడేట్‌ అండ్‌ జనరేట్‌ ఓ టీపైకి క్లిక్‌ చేయాలి. ధృవీకరించిన తరువాత సంస్థకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని నమోదు చే యాలి. బ్యాంకు ఖాతా నెంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో స హా సంస్థ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చే యాలి. సంస్థ ప్రధాన వ్యాపార కార్యకలాపాల వివరా లను, దాని ఎస్‌ఐసీ కోడ్‌తో సహా నమోదు చేయాలి. సబ్మిట్‌పై క్లిక్‌ చేసే ముందు నమోదు చేసిన సమాచా రం సరియైనదిగా నిర్దారించుకోవాలి. జనరేట్‌ అయిన ఉద్యోగుల రిజిస్ట్రేషన్‌ (యూఆర్‌ఎన్‌) కోసం రిజిష్టర్డ్‌ ఈ-మెయిల్‌, చిరునామా, మొబైల్‌ నెంబర్‌ను తనిఖీ చే యాలి. యూఆర్‌ఎన్‌ను ఉపయోగించి ఉద్యమ్‌ రిజి స్ట్రేషన్‌ పోర్టల్‌ నుంచి ఈ -సర్టిఫికేట్‌ లేదా ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

రూ. 257 కోట్ల రుణాల మంజూరుకు...

జిల్లా వ్యాప్తంగా వ్యాపారాలు చేసేందుకు చిన్న, మ ధ్య తరహా పరిశ్రమల స్థాపనకు వీలుగా మెప్మా సభ్యు లకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 25757.93 కోట్ల రు ణాలు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలోని బె ల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట, మంచి ర్యాల, మందమర్రి, నస్పూర్‌ మున్సిపాలిటీలలో మొత్తం 5614 మెప్మా సంఘాలు ఉన్నాయి. వీటిలో సెల్ప్‌ హె ల్ప్‌ గ్రూపులు (ఎస్‌హెచ్‌జీ) 5363, స్లమ్‌ లెవల్‌ ఫెడ రేషన్‌(ఎస్‌ఎల్‌ఎఫ్‌)లు 244, టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌ (టీఎల్‌ఎఫ్‌)లు 7 ఉన్నాయి. ఆయా సంఘాల్లో మొత్తం 56,130 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలోని మొత్తం ఎస్‌హెచ్‌జీల నుంచి ఈ ఏడాది 1049 గ్రూపులకు రూ. 257 కోట్ల 57 లక్షల 93వేల రుణాలు మంజూరు చే యాలనే లక్ష్యంతో ఉన్నారు. జిల్లాలోని బ్యాంక్‌ లింకేజీ కలిగిన సంఘాలకు పై రుణాలను అందజేస్తారు. నిర్దే శిత లక్ష్యాల మేరకు రుణాలు తీసుకునే ప్రతీ సభ్యు రాలు ఉద్యమ్‌ ఆధార్‌ ధృవీకరణ పత్రాన్ని కచ్చితంగా పొంది ఉండాలి. ధృవీకరణ పత్రాలు పొందేందుకు సం ఘాల సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

సిబ్బంది సహాయం తీసుకోవాలి...

రాజు, మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

ఉద్యమ్‌ ఆధార్‌ పొందడం కోసం సంఘాల మహి ళలు సంబంధిత సీవో, ఆర్పీల సహాయ సహకారాలు తీసుకోవాలి. ఉద్యమ్‌ ఆధార్‌ కోసం సహాయం చేసే సి బ్బందికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. స్వయం స హాయక సంఘాలలోని ప్రతీ మహిళ ఉద్యమ్‌ ఆధార్‌ కలిగి ఉండటం తప్పనిసరి. ఉద్యమ్‌ ఆధార్‌ పొందడం వల్ల మెప్మా రుణాలను సులభంగా పొందేందుకు వీలు కలుగుతుంది.

Updated Date - Oct 13 , 2025 | 11:01 PM