Share News

kumaram bheem asifabad- వ్యవసాయంలో కొత్తపుంతలు తొక్కాలి

ABN , Publish Date - Jun 12 , 2025 | 10:23 PM

రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యంలో వ్యవసాయ రంగంలో కొత్తపుంతలు తొక్కాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం వంజిరి గ్రామంలోని రైతువేదికలో గురువారం ప్రొపెఫసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ కృషి కేంద్రం బెల్లంపల్లి శాఖ, కాగజ్‌నగర్‌ ధనుకా అగ్రిటెక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత కృషి కల్ప అభియాన్‌ కార్యక్రమ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

kumaram bheem asifabad- వ్యవసాయంలో కొత్తపుంతలు తొక్కాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు, పాల్గొన్న అధికారులు

కాగజ్‌నగర్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రైతులు, శాస్త్రవేత్తల భాగస్వామ్యంలో వ్యవసాయ రంగంలో కొత్తపుంతలు తొక్కాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం వంజిరి గ్రామంలోని రైతువేదికలో గురువారం ప్రొపెఫసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ కృషి కేంద్రం బెల్లంపల్లి శాఖ, కాగజ్‌నగర్‌ ధనుకా అగ్రిటెక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత కృషి కల్ప అభియాన్‌ కార్యక్రమ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. శాస్త్రవేత్తల భాగస్వామ్యంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలన్నారు. తద్వార పటిష్టమైన, సమగ్రత కలిగిన వ్యవసాయాన్ని ప్రొత్సహించడమే కాకుండా పంట దిగుబడి కూడా అధికంగా వస్తోందన్నారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతను రైతులకు చేరవేయడంతో పంటలపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని కోరారు. రసాయనిక ఎరువులు, పురుగులు మందులు వాడకుండా వ్యవసాయ శాస్త్రవేత్త సలహాలు పాటించి పంట మార్పిడి పద్ధతులను రైతులు పాటించాలన్నారు. బెల్లంపల్లి ప్రొగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శివకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను రైతులకు చేరవేసే ఉద్దేశ్యంతో పాటు తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకు రసాయానాలను వినియోగించడంతో నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడటంతో భావితరాల వరకు సాగును అందించవచ్చన్నారు. పంట మార్పిడితో సుస్తిర ఆదాయాన్ని పొందవచ్చన్నారు. చెట్లను పెంచడంతో పర్యావరణాన్ని కాపాడవచ్చన్నారు. కృషి విజ్ఙాన కేంద్రం, బెల్లంపల్లి శాస్త్రవేత్త నాగరాజు మాట్లాడుతూ వానాకాలం సాగు చేసే పంటలు వాటి చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన అంశాను వివరించారు. సమావేశంలో అగ్రిటెక్‌ ప్రయివేటు లిమిటేడ్‌ కంపెని శాస్త్రవేత్త శంకర్‌, కాగజ్‌నగర్‌ మండల వ్యవసాయ విస్తరణ అధికారులు శైలేష్‌, సృజన, ధునకా అగ్రిటెక్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కంపెని ఏరియా మేనేజర్‌ నగేష్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 10:23 PM