New Leadership Elected for PRTU: పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా దామోదర్ రెడ్డి, బిక్షం గౌడ్
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:40 AM
రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు...
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పీఆర్టీయూ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో పీఆర్టీయూ అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పుల్గం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సుంకరి బిక్షం గౌడ్ ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ చైర్మన్‌గా సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకున్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.