Erragadda Hospital: ఎర్రగడ్డ ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:07 AM
రాష్ట్రంలో మత్తుకు బానిసైనవారి కోసం హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రాంగణంలో..
మత్తు పదార్థాల వ్యసనాన్ని అరికట్టడమే లక్ష్యం: దామోదర
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత్తుకు బానిసైనవారి కోసం హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్) ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో డీఅడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ తెలిపారు. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఇప్పటికే డీఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయని, అవసరాన్ని బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో వైద్యారోగ్య శాఖ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఏఎన్‌బీ) ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను టీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఈ సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలన పోరాటంలో సమాజంలోని అన్ని వర్గాలనూ భాగస్వామ్యం చేయాలని సూచించారు. అన్ని విద్యాసంస్థల్లో యాంటీ నార్కోటిక్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.