BC reservation: నూతన బీసీ జేఏసీ ఆవిర్భావం
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:53 AM
నూతన బీసీ జేఏసీ ఆవిర్భావించింది. జేఏసీ చైర్మన్‌గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్, వర్కింగ్ చైర్మన్‌గా గుజ్జ కృష్ణ ఏకగ్రీవంగా నియమితులయ్యారు.....
చైర్మన్‌గా జాజుల శ్రీనివా్‌సగౌడ్
బర్కత్‌పుర, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): నూతన బీసీ జేఏసీ ఆవిర్భావించింది. జేఏసీ చైర్మన్‌గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్, వర్కింగ్ చైర్మన్‌గా గుజ్జ కృష్ణ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్‌లో బీసీ రిజర్వేషన్లు, సర్పంచ్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. నూతన బీసీ జేఏసీ చైర్మన్ జాజుల
శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు తెగించి పోరాడుతామన్నారు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 25న రాష్ట్రవ్యాప్తంగా బీసీ ద్రోహుల పార్టీల దిష్టిబొమ్మల దహనం, 30న రాజకీయ యుద్ధభేరీ పేరుతో ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది బీసీ కుల వృత్తిదారులతో సుందరయ్యపార్కు నుంచి ఇందిరాపార్కు వరకు మహాప్రదర్శన జరుగుతుందని, అనంతరం రాజకీయ యుద్ధభేరీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబరు 8, 9 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తున్నామన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ద్వారానే 42శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలవాలని సూచించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ చట్టాలు, న్యాయస్థానాలు అగ్రకులాలకు చుట్టాలుగా మారుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఢిల్లీ స్థాయిలో ఉద్య మం చేపట్టాలని, ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీని కలిసి పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ సినీ నిర్మాత శంకర్ తదితరులు పాల్గొన్నారు.