Share News

స్కూల్‌ గేమ్స్‌పై నిర్లక్ష్య ధోరణి...!

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:34 PM

పాఠశా ల స్థాయిలో విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొం దిం చి, ప్రభుత్వపరంగా తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా క్రీడా రంగాల్లో స్థిరపడేందుకు దోహదపడే టోర్నమెంట్ల నిర్వ హణ జిల్లాలో నామ్‌కే వాస్తేగా సాగుతోంది.

స్కూల్‌ గేమ్స్‌పై నిర్లక్ష్య ధోరణి...!

-ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రెటరీ నియామకంలో జాప్యం

-ఇప్పటికే తొలి షెడ్యూల్‌ కోల్పోయిన విద్యార్థులు

-మండల పోటీలు లేకుండానే నేరుగా జిల్లాస్థాయికి

-క్రీడల్లో ప్రతిభను కోల్పోతున్న విద్యార్థులు

-తాజా షెడ్యూల్‌ కోసం ఎదురు చూపు

మంచిర్యాల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): పాఠశా ల స్థాయిలో విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొం దిం చి, ప్రభుత్వపరంగా తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా క్రీడా రంగాల్లో స్థిరపడేందుకు దోహదపడే టోర్నమెంట్ల నిర్వ హణ జిల్లాలో నామ్‌కే వాస్తేగా సాగుతోంది. తూతూ మంత్రంగా క్రీడలు నిర్వహిస్తూ మమ అంటున్నారే త ప్ప.. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీ యడంలో జిల్లా క్రీడల విభాగం పూర్తిగా విఫల మైం దన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశా లల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) క్రీడా పోటీల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎస్‌జీ ఎఫ్‌ఐ తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు మొదటి, రెండో వారంలో మండల స్థాయి టోర్నమెంట్లు పూర్తి కావాలి. మూడో వారంలో జోనల్‌ (అంతర్‌ మండల) టోర్నమెంట్‌తో పాటు జిల్లా జట్ల ఎంపిక జరగాలి. సె ప్టెంబర్‌ 2వ వారంలో జిల్లా స్పోర్ట్స్‌ జోన్‌ టోర్నమెం ట్‌తో పాటు సెలెక్షన్స్‌, నాలుగో వారంలో రాష్ట్ర స్థాయి జిల్లా స్పోర్ట్స్‌ జోన్‌ టోర్నమెంట్‌తో పాటు క్రీడా కారుల సెలెక్షన్లు జరగాల్సి ఉంది. రాష్ట్రస్థాయి జట్ల ఎంపికలో పది ఉమ్మడి జిల్లాల స్పోర్ట్స్‌ జోన్‌ల క్రీడాకారులు పా ల్గొంటారు. ఇవి అక్టోబర్‌ మొదటి వారంలో జరగాలి. అయితే ఆగస్టు గడిచినా ఇప్పటి వరకు జిల్లాలో మం డల స్థాయి క్రీడలు జరుగకపోవడమే జిల్లా క్రీడల వి భాగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

అటకెక్కిన తొలి షెడ్యూల్‌...

జూన్‌ 27న పాఠశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ నికో లస్‌ ప్రకటించిన క్రీడల షెడ్యూల్‌....రాష్ట్రస్థాయిలో, జిల్లా ల స్థాయిలో ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీల నియామకం జరగ కపోవడంతో ఆటకెక్కింది. వాస్తవంగా ఎస్‌జీఎఫ్‌ సెక్రెట రీల కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది. అది ఈ యేడు మార్చి నెలాఖరుతోనే ముగిసింది. ఆ వెంటనే ఏప్రిల్‌ లేదా మే నెలలో కొత్తవారి నియామకాల ప్రక్రియ పూ ర్తికావలసి ఉండగా, ఆగస్టు వరకు జాప్యం చేశారు. జిల్లాలో ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ నియామకం కేవలం పది రోజుల క్రితమే జరిగింది. జిల్లా సెక్రెటరీగా సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ యాకూబ్‌ ఇటీవల బాధ్యతలు స్వీకరిం చారు. సెక్రెటరీ నియామకంలో జాప్యం కారణంగా 2025-26 సంవత్సరానికి ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల నిర్వ హణకు షెడ్యూల్‌ జారీ అయినప్పటికీ అది కార్యరూ ప ల దాల్చలేదు. ఆయా జిల్లాల స్థాయిలో ఎస్‌జీఎఫ్‌ క్రీ డా పోటీల నిర్వహణ బాధ్యత సెక్రెటరీలపై ఉంటుం ది. సెక్రెటరీ నియామకం సమయానికి జరుగకపోవ డంతో జూన్‌లో జారీ అయిన షెడ్యూల్‌ బుట్టదాఖలైంది.

మండల స్థాయి పోటీలు లేకుండానే....

మండల స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణకు ప్రతీ మండలానికి ఒక ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ ఉంటారు. ప్రతి మండలానికి ఒక ఎస్‌జీఎఫ్‌ను నియమించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. ప్రస్తుతానికి మం డలంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్‌ పీడీలకు ఎస్‌ జీఎఫ్‌ బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయి ఎస్‌జీ ఎఫ్‌ల నియాయకాలు పూర్తయితే తప్ప తొలుత మం డల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించే అవకాశం ఉండదు. ఈ కారణంగానే జిల్లాలో ఏ మండలంలో కూ డా తొలి షెడ్యూల్‌ ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు జరగలే దు. పాఠశాల క్రీడాకారులను నేరుగా జిల్లా స్థాయిలో నే తూతూ మంత్రంగా ఆడిపించారు. మండలాల్లో ప్ర త్యేకంగా సెక్రెటరీ నియామకం జరిగి ఉంటే, విద్యార్థు లకు అవసరమైన శిక్షణ ఇచ్చి, టోర్నమెంట్‌కు సిద్ధం చే సి ఉండేవారు. దీంతో క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపు ణ్యం వెలికితీసేందుకు దోహదపడేది. అందుకు భిన్నం గా మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించకుం డానే నేరుగా జిల్లా స్థాయి టోర్నమెంటులో పాల్గొనడం వల్ల ప్రతిభ కనబరిచే అవకాశం విద్యార్థులకు దక్కలే దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండ గా ఎస్‌జీఎఫ్‌ జిల్లా సెక్రెటరీ నియామకం కూడా ఆల స్యం కావడంతో ఇప్పటి వరకు కేవలం ఫుట్‌బాల్‌, స్వి మ్మింగ్‌ క్రీడలకే పరిమితం అయ్యారు.

కొత్త షెడ్యూల్‌ ఎప్పుడు...?

ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల నిర్వహణకు కొత్త షెడ్యూల్‌ ఇంకా ఖారారు కాలేదు. జిల్లా ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీలతో జరిగే సమావేశంలో దీనిని ఖరారు చేస్తారు. క్రీడా పో టీల నిర్వహణపై ఇటీవల జూమ్‌ సమావేశం మాత్రమే జరిగింది. పూర్తిస్థాయి సన్నాహక సమావేశం జరగక పోవడంతో తాజా షెడ్యూల్‌ ఖరారులో జాప్యం జ రుగుతోంది. హైదరాబాద్‌లో ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర ఆర్గనై జింగ్‌ సెక్రెటరీతో జిల్లా ఎన్టీజీఎఫ్‌ సెక్రెటరీల సమా వేశం నిర్వహించి, షెడ్యూల్‌ ఖరారు చేస్తారు. సమా వేశం ఏర్పాటులోనూ తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తె లుస్తోంది. ఆ సమావేశం జరిగితే తప్ప ఎస్‌జీఎఫ్‌ ద్వి తీయ షెడ్యూల్‌ క్రీడా పోటీలు ప్రారంభం అయ్యే అవకాశాలు లేవు.

కళాశాల స్థాయి వరకు క్రీడలు...

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కేజీ బీవీలు, గురుకులాలు, జూనియర్‌ కాలేజీలలో ఎస్‌జీ ఎఫ్‌ క్రీడా పోటీలు నిర్వహించాల్సి ఉంది. వీటిలో పాఠ శాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు అండర్‌ -14, ఆండర్‌ -17 విభాగంలో, ఇంటర్‌ విద్యార్థులు అండర్‌ -19 విభాగంలో క్రీడా పోటీల్లో పాల్గొంటారు. బాల బా లికలకు వేర్వేరుగా వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ పోటీలు ని ర్వహిస్తారు. వీటితో పాటు అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, చ దరంగం, టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, తదితర క్రీడల్లో కూ డా పోటీలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిభ చాటిన వి ద్యార్థులు జాతీయ స్థాయి వరకు రాణించేందుకు అవ కాశం ఉంటుంది. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చి దిద్దే ఎస్‌జీఎఫ్‌పట్ల నిర్లక్ష్య ధోరణిని పలు క్రీడా సం ఘాలు తప్పుబడుతున్నాయి.

Updated Date - Sep 12 , 2025 | 11:34 PM