Share News

పశు వైద్యంపై నిర్లక్ష్యం..!

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:41 PM

మూగ జీవా ల పట్ల ఆది నుంచి ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని వీడ టం లేదు. పశు సంవర్థక శాఖకు పెద్దపీట వేస్తామ న్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తన మాటను నిల బె ట్టుకోవడంలో విఫలం అవుతుందనే చెప్పాలి.

పశు వైద్యంపై నిర్లక్ష్యం..!

-సిబ్బంది కొరతో తప్పని ఇబ్బందులు

-శిథిలావస్థకు చేరిన ఆస్పత్రి భవనాలు

-అందుబాటులోలేని పాముకాటు, పొదుపువాపు మందులు

-జిల్లాలో 10 లక్షల వరకు వివిధ రకాల పశువులు

-ఇరుకు స్థలాల్లో మూగజీవాలకు చికిత్స

మంచిర్యాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మూగ జీవా ల పట్ల ఆది నుంచి ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని వీడ టం లేదు. పశు సంవర్థక శాఖకు పెద్దపీట వేస్తామ న్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తన మాటను నిల బె ట్టుకోవడంలో విఫలం అవుతుందనే చెప్పాలి. అత్యవ సర సమయాల్లో పశువుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన పాముకాటు చికిత్స మందులు జిల్లా వ్యా ప్తంగా ఏ మండలంలోనూ అందుబాటులో లేవంటే అ తిశయోక్తికాదు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ని ర్లక్ష్యానికి గురైన పశు సంవర్థకశాఖలో కాంగ్రెస్‌ ప్రభు త్వంలో కొంతమేర మార్పులు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో చికిత్స అందడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

జిల్లాలో 10 లక్షల వరకు పశువులు...

జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పశువులు 10 లక్షల వరకు ఉన్నాయి. వాటిలో ఆవులు, ఎద్దులు కలిపి 1.86 లక్షలు ఉండగా, గేదెలు 94వేలు, మేకలు 2 లక్షలు, గొ ర్లు 5.13 లక్షలు ఉన్నాయి. ఇంకా కోళ్లు సైతం పెద్ద సం ఖ్యలోనే ఉన్నాయి. వీటన్నంటికీ చికిత్స అందించేందు కు ప్రస్తుతం జిల్లాలో మందుల కొరత లేనప్పటికీ ఇత రత్రా కారణాలు ఇబ్బందికి గురి చేస్తున్నాయి. మందుల కొనుగోలుకు అవసరమైన నిధులు సైతం ప్రభుత్వం ఎ ప్పటికప్పుడు విడుదల చేస్తుండటంతో పెద్దగా ఇబ్బం దులు తలెత్తడం లేదు. గత సంవత్సరం రెండు త్రైమా సికాలకు సంబంధించి మొత్తం రూ. 14 లక్షలు విడుద లకాగా, ఈ యేడు ఇప్పటికే రూ. 31 లక్షలు విడుదల కాగా, మొత్తంగా జిల్లాలోని పశువులకు సరిపడా 66 ర కాల మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అ యితే పాముకాటు, పొదుపువాపు వ్యాధికి సంబంధిం చి మాత్రం జిల్లాలో ఎక్కడా కూడా అవసరమైన మం దులు అందుబాటులో లేవు. పై రెండు అంశాల విష యంలో మాత్రం అత్యవసర సమయాల్లో సంబం ధిత పశువుల యజమానులు మందుల కోసం ప్రైవేటు మె డికల్‌ స్టోర్స్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితులు ఉన్నా యి. పాముకాటు, పొదుపువాపు మందులు అధిక ఖ ర్చుతో కూడుకున్నవి కావడంతో ప్రభుత్వపరంగా సర ఫరా చేయడం లేదని సమాచారం.

వెక్కిరిస్తున్న సిబ్బంది కొరత...

పశు సంవర్థకశాఖలో జిల్లాకు సంబంఽధించి పూర్తిస్థా యి సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో పశువులకు చికిత్స అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 44 వెటర్నరీ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో వైద్యులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్న ప్పటికీ కిందిస్థాయి సిబ్బంది సంఖ్య సరిపడా లేదు. జిల్లాలోని లక్షెట్టిపేట, చెన్నూరు మండల కేంద్రాల్లో ఏరి యా వెటర్నిటీ ఆసుపత్రులు ఉండగా, రెండు చోట్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులు ఉన్నారు. అలాగే 27 ప్రాథమిక పశువైద్య శాలలు ఉండగా, వాటిలో పూ ర్తిస్థాయిలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. 15 సబ్‌ సెంటర్లు ఉండగా, వాటిలో ప్యారా వెటర్నరీ సిబ్బంది పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా వెటర్నరీ అసిస్టెం ట్లకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. జిల్లాలో 16 మంది వరకు వెటర్నరీ అసిస్టెంట్లు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఈ వి భాగంలో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే అ టెండర్ల విషయానికి వస్తే 26 మంది ఉండాల్సి ఉండ గా, కేవలం 17 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మి గతా తొమ్మిది ఖాళీలు ఉండటంతో చికిత్సల్లో కొంతమేర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

అరకొర వసతులతో భవనాలు...

పశు సంవర్థకశాఖలో భవనాల పరిస్థితి పూర్తిగా ధీ న స్థితిలో ఉంది. కొన్ని చోట్ల ఆరవై డెబ్బై ఏళ్ల క్రితం ని ర్మించినవి కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకు న్నాయి. మరికొన్ని చోట్లా కేవలం చిన్న గదిలో ఆసుప త్రులు నిర్వహించాల్సి వస్తోంది. దశాబ్దాల కాలంగా ఇ దే పరిస్థితి నెలకొన్నప్పటికీ, భవనాల నిర్మాణం విష యంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 44 వెటర్నరీ ఆసుపత్రులకు గాను కేవలం ఐదు చోట్ల మాత్రమే శాశ్వత సొంత భవనాలు ఉండ టం గమనార్హం. రేచిన, బెల్లంపల్లి, ఆస్నాద్‌, ఆవడం, లక్షెట్టిపేటలో మాత్రమే సొంత భవనాలు అందుబాటు లో ఉండగా, ఇంకా 39 చోట్ల అరకొర సౌకర్యాలే ఉ న్నాయి. భీమిని, కాసిపేట, చెన్నూరులో చిన్న గదుల్లో ఆసుపత్రులు నిర్వహిస్తుండగా, వాటిలో కొన్ని శిథిలా వస్థకు చేరి, ఏ క్షణాన కూలిపోతాయో తెలియని పరి స్థితులు ఉన్నాయి. నెన్నెల, చెన్నూరు మండలం కత్తెర శాలలో అసలు భవనాలే లేవు. హాజీపూర్‌, ముల్కల్లలో భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరి, కూలడానికి సి ద్ధంగా ఉన్నాయి. హాజీపూర్‌లోని భవనం స్లాబు కురు స్తుండగా, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితు లు ఉన్నాయి. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలో హౌ సింగ్‌ బోర్డుకు చెందిన ఓ చిన్న గదిలో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఇలా అరకొర సౌకర్యాల మధ్య మూ గజీవాలకు చికిత్సలు అందిస్తుండటంతో నానా ఇబ్బం దులు ఏర్పడుతున్నాయి.

చికిత్స పరంగా ఇబ్బందులు లేవు...పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి డా. శంకర్‌

జిల్లాలో పశువుల వైద్యానికి సంబంఽధించి ప్రస్తుతా నికి ఎలాంటి ఇబ్బందులు లేదు. పశువుల సంఖ్యకు స రిపడా అన్ని రకాల మందులు పూర్తిస్థాయిలో అందు బాటులో ఉన్నాయి. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగ డంలేదు. వైద్యుల పరంగా చూసినా పూర్తిస్థాయిలో విధుల్లో ఉన్నారు. సిబ్బంది కొరత కొంతమేర ఉంది. పలుచోట్లా ఆసుపత్రుల భవనాలు శిథిలావస్థకు చేరగా, మరికొన్ని చోట్లా చిన్న గదుల్లో ఆసుపత్రులు నిర్వహిం చాల్సి వస్తున్న విషయం వాస్తవమే. సొంత భవనాల కోసం ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపడం జరిగిం ది. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పంది స్తుందనే ఆశాభావంతో ఉన్నాం.

Updated Date - Aug 24 , 2025 | 11:41 PM