Share News

విద్యార్థులపై నిర్లక్ష్యం సహించం

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:17 PM

విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉ పేక్షింబోమని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

విద్యార్థులపై నిర్లక్ష్యం సహించం
విద్యార్థినులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉ పేక్షింబోమని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర సమీపంలోని ఉయ్యాలవాడ మహాత్మాజ్యోతిబాఫూలే గురు కులా న్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆ పాఠ శాలలో ఇటీవల అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య వివరాలను కలెక్టర్‌ తెలుసుకున్నారు. బియ్యాన్ని పరిశీలించి బియ్యం స్టాక్‌ రిజిస్టర్‌ను చెక్‌ చేశారు. వండే బియ్యాన్ని ఒక రోజు ముందే శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని వంట ఏజెన్సీకి కలెక్టర్‌ సూచిం చారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థా లను కలెక్టర్‌ పరిశీలించారు. గురుకుల పాఠశా లలో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యం, వసతులతో పాటు విద్యాప్రమాణాలు మెరుగు పర్చడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్‌ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. విద్యార్థులు క్రమశి క్షణతో లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యాపరంగా ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్విని యోగపర్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించా లన్నారు. కలెక్టర్‌ వెంట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:17 PM