Share News

Medical Students Rights: వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:52 AM

వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణాచారి అన్నారు..

Medical Students Rights: వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణే ధ్యేయం

  • నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యార్థుల హక్కుల పరిరక్షణనే ధ్యేయంగా పనిచేస్తామని నీట్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణాచారి అన్నారు. హైదరాబాదు ఎల్బీనగర్‌ లో జరిగిన నీట్‌ పేరెంట్స్‌ సమావేశంలో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షునిగా మల్లోజు సత్యనారాయణాచారి, ఉపాధ్యక్షునిగా బొడ్డుపల్లి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా పొడి శెట్టి రమేష్‌ నియామకమయ్యారు. ప్రధాన సలహాదారుగా బీరెల్లి కమలాకర్‌ రావు, సంయుక్త కార్యదర్శులుగా డి.రఘుపతి, రాజు, కోశాధికారిగా ఎం. శ్రీధర్‌లను ఎన్నుకున్నారు.

Updated Date - Sep 11 , 2025 | 04:52 AM