నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ABN , Publish Date - May 05 , 2025 | 12:07 AM
జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించి న నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసి ంది.
సూర్యాపేట(కలెక్టరేట్), సూర్యాపేటరూరల్, మే 4, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించి న నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసి ంది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేట, ఇమాంపేట సమీ పంలో గల మోడల్ స్కూల్, తెలంగాణ ఎస్సీ బాలికల గురుకుల కళాశాల, దురాజ్‌పల్లి వద్ద గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మఽధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షను నిర్వహించారు. 890 మంది విద్యార్థు లు హాజరు కావాల్సి ఉండగా, 859 మంది విద్యార్థులు హాజరయ్యారు. 31మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 11గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ తీసుకు న్నారు. నిర్దేశించిన సమయం అనంతరం వచ్చిన పరీక్షా కేంద్రంలోకి అను మ తించలేదు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలు తరలింపు పరీక్ష అనంతరం సమాధాన పత్రాల తరలింపు ను పోలీస్ బందోబస్తు నడుమ తరలించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్దులకు అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు చేశారు. పరీ క్షా కేంద్రాలను ఎస్పీ కొత్తపల్లి నర్సింహ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మే క నాగేశ్వర్‌రావు, ఆర్డీవో వేణుమాధవ్, డీఎస్పీ కొండం పార్థసారధి, తహసీల్దార్లు శ్యాంసుందర్‌రెడ్డి, క్రిష్ణయ్య, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయలత, ఎస్‌బీఐ నాగభూషణరావు తదితరులు ఉన్నారు.
పిల్లలకు వాహనాలు ఇస్తే కేసు
పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇస్తే పిల్లలతో పాటు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపడం చట్ట ప్రకారం నేరమన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ ఒకసారి పట్టుబడితే వారికి 25ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వడం కుదరదన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వం నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తుందన్నారు. మైనర్లు వాహానాలు నడిి పనందుకు గరిష్టంగా రూ.25వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి రోజు జిల్లాలో వాహానాల తనిఖీలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఇతరులు మైనర్లకు వాహానాలు ఇవ్వవద్దన్నారు.