Minister Suresh in Defamation Case: మంత్రి సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:55 AM
రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం .....
కేటీఆర్ పరువు నష్టం కేసులో విచారణకు రాకపోవడంతోనే..
ఎన్‌బీడబ్ల్యూ జారీ అవాస్తవం
మంత్రి కార్యాలయం
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసు గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు వచ్చింది. అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రి సురేఖ ముందస్తు సమాచారం ఇవ్వకుండా కోర్టుకు గైర్హాజరయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి శ్రీదేవి.. తదుపరి విచారణకు ఆమె తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు గైర్హాజరు పిటిషన్లు వేయడంతో వచ్చేసారి కచ్చితంగా హాజరవ్వాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేశారు. సినీ నటులు నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆరే కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరువునష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. కాగా, సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 5న తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు.