kumaram bheem asifabad- ఇందిరానగర్‌లో నవరాత్రులకు ముస్తాబు
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:26 PM
రెబ్బెన మండలం ఇందిరాగనర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో సోమవారం నుంచి అక్టోబరు 2 వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనానికి మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర జిల్లాల నుంచి భక్తులు వచ్చి మొక్కలు తీర్చుకుంటున్నారు.
రెబ్బెన, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం ఇందిరాగనర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో సోమవారం నుంచి అక్టోబరు 2 వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనానికి మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర జిల్లాల నుంచి భక్తులు వచ్చి మొక్కలు తీర్చుకుంటున్నారు. ఈ సారి నవరాత్రుల ప్రత్యేక పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవరాత్రి ఉత్సవాలు కావడం విశేషం. ఏటా పది రోజుల పాటు ఉండగా, ఈ సారి మాత్రం 11 రోజులు నిర్వహించనున్నారు. దీని కారణం ఒకే తిథి రెండు రోజులు రావడమేనని పండితులు చెబుతున్నారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి, రెండోరోజూ రోజు గాయత్రీ దేవి, మూడో రోజు అన్నపూర్ణదేవి, నాల్గవ రోజు మహంకాలి, ఐదో రోజు లలిత త్రిపుర సుందరి దేవి ఆవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆరో రోజు మహాలక్ష్మీ, ఏడో రోజు మహాచండీ, ఎనిమిదివ రోజు మహా సరస్వతి, తొమ్మిదో రోజు దుర్గాదేవి పదో రోజు మహిషాసుర మర్ధిని, 11వ రోజు శాంత స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు తిరుపతిగౌడ్ తెలిపారు.
నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు..
దేవర వినోద్, ఆలయ పూజారి
నవరాత్రి ఉత్సవాల కోసం అన్నీ ఏర్పాట్లు చేయటం జరిగింది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నాం. భక్తులకు అన్నీ సౌకర్యాలు కల్పించటం జరిగింది. భక్తులు రద్దీ ఈ సారి పెరిగే అవకాశం ఉంది. ముందస్తు అన్నీ చర్యలు తీసుకున్నాం.