Share News

kumaram bheem asifabad- విద్యార్థుల భవితకు ‘నవోదయ’ం

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:09 PM

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అధునాతన, నాణ్యమైక, క్రమశిక్ష ణ, క్రీడల్లో ప్రతిభతో పాటు అనేక సదుపాయాలతో విలువలతో కూడిన విద్యను అందించేందుకు కేంద్ర మాననవనరులశాఖ ఆధ్వర్యంలో జవహర్‌ నదోదయ విద్యాలయాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో కాగజన్‌గర్‌ లో మాత్రమే నవోదయ విద్యాలయం ఏర్పాటైంది.

kumaram bheem asifabad- విద్యార్థుల భవితకు ‘నవోదయ’ం
: కాగజ్‌నగర్‌లోని జవహర్‌ నవోదయ విద్యాలయం

- డిసెంబరు 13న ప్రవేశపరీక్ష

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అధునాతన, నాణ్యమైక, క్రమశిక్ష ణ, క్రీడల్లో ప్రతిభతో పాటు అనేక సదుపాయాలతో విలువలతో కూడిన విద్యను అందించేందుకు కేంద్ర మాననవనరులశాఖ ఆధ్వర్యంలో జవహర్‌ నదోదయ విద్యాలయాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో కాగజన్‌గర్‌ లో మాత్రమే నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. ఇక్కడ కార్పొరేట్‌ విద్యకు దీటుగా అత్యున్నత ప్రమాణా లతో కూడిన విద్యను బోధిస్తున్నారు. ఏటా అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతుండడంతో వారు దేశంలోనే ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారిన నవోదయ విద్యాల యాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్‌ వెలువడిం దని, ఆరోతరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ను ఆన్‌లైన్‌ పద్ధతిలో చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ రేపాల క్రిష్ణ తెలిపారు.

- అర్హతలు.. రిజర్వేషన్‌ విధానం..

నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన పాఠశాల లో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న బాలిబాలికలు అర్హులు. వీరు 01.05.2014 నుంచి 31.07.2016 మధ్య జన్మించి ఉండాలి. పరీక్ష రాసే అభ్యర్థులు 3, 4, 5, తరగతులు గ్రామీణ ప్రాంతాల్లో చదవి ఉత్తీర్ణులవ్వాలి. నవోదయ విద్యాల యంలో ప్రవేశానికి రిజర్వేషన్‌ విధానం పక్కాగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 75శాతం, పట్ట ణ ప్రాంత విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయిస్తారు. 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 3 శాతం దివ్యాం గులు, బాలికలకు 1/3 వంతు రిజర్వేషన్‌ ఉంటుంది.

- ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..

విద్యాలయంలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. డబ్ల్యూ,డబ్ల్యూ.డబ్లూ. నవోదయ.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఇంటర్నెట్‌ ద్వారా దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాఠశాలలో ఆరో తరగతిలో 80 సీట్లకు గానూ ఉమ్మడి జిల్లా నుంచి గతేడాది 5.900 దరఖా స్తులు వచ్చినట్లు విద్యాలయ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 29తేదీ ఆఖరు తేదీగా ప్రకటించారు, డిసెంబరు 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈఏడాది సులభతరంగా దరఖాస్తులను అప్‌లోడ్‌ చేసేవిధంగా మార్పులు చేశారని సూపరింటెం డెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆరోతరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్‌ వరకు ఉచితంగా విద్యా భోదనతో పాటు కంప్యూటర్‌ విద్య, క్రీడలు, ల్యాబ్‌, లైబ్రరీ సౌకర్యం ఉంటుంది. అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండడంతో ఏటా 100 శాతం రిజల్ట్‌తో పాటు పూర్వ విద్యార్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి అత్యున్నత స్థాయి ల్లో ఉన్నారని విద్యాలయ అధికారులు తెలిపారు.

ప్రవేశాల కోసం దళారులను ఆశ్రయించొద్దు

- రేపాల క్రిష్ణ, ప్రిన్సిపాల్‌

విద్యాలయంలో ప్రవేశాల కోసం ఎలాంటి దళారులను ఆశ్రయించవద్దు. ప్రవేశాలు, ఎంపిక ప్రక్రియ పూర్తి పార దర్శకంగా ఉంటుంది. మార్కుల ఆధారంగానే అడ్మిషన్స్‌ ఉంటాయి. కష్టపడి చదివితే సీటు సాధించడం సులభం. సీటు సాధించన వారికి అన్ని ఉచితంగానే అందుతాయి.

Updated Date - Jul 01 , 2025 | 11:09 PM