Share News

National Prisons Academy: వికారాబాద్‌లోనే నేషనల్‌ ప్రిజన్స్‌ అకాడమీ!

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:45 AM

నేషనల్‌ ప్రిజన్స్‌ అకాడమీని వికారాబాద్‌లోనే ఏర్పాటు చేసేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్‌...

National Prisons Academy: వికారాబాద్‌లోనే నేషనల్‌ ప్రిజన్స్‌ అకాడమీ!

  • ఏర్పాటుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కసరత్తు

  • మరోసారి ప్రతిపాదనలు పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం

  • రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా వెల్లడి

వికారాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ ప్రిజన్స్‌ అకాడమీని వికారాబాద్‌లోనే ఏర్పాటు చేసేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్యామిశ్రా తెలిపారు. వికారాబాద్‌ శివారులోని కొత్రేపల్లి సమీపంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఖైదీల వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సౌమ్యామిశ్రా మాట్లాడుతూ.. జైళ్లకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రిజన్స్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రం స మీపంలో ఉన్న స్థలం అకాడమీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఈ అకాడమీ కోసం పదేళ్ల క్రితం అప్ప టి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, వాటిలో కొన్ని సవరణలు చేసి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మళ్లీ పంపుతుందని వెల్లడించారు. పోలీసు శాఖకు నేషనల్‌ పోలీస్‌ అకాడమీ మాదిరిగానే జైళ్ల శాఖకు నేషనల్‌ ప్రిజన్స్‌ అకాడమీ ఏర్పాటు కానుందన్నారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వ్యవసాయ క్షేత్రంలో తేనెటీగల పెంపకాన్ని పరిశీలించారు. ఆమె వెంట జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్‌, జిల్లా అధికారి శ్రీనివా్‌సరెడ్డి, పరిగి జైలు జైలర్‌ రాజ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 03:45 AM