Share News

kumaram bheem asifabad- నారు దశ.. జాగ్రత్తలే రక్ష

ABN , Publish Date - Dec 01 , 2025 | 10:18 PM

మండలంలో రైతులు వరి నారు మడులు తయారు చేస్తున్నారు. వరి పంట సాగులో భాగంగా నారు మడి తయారు చేయు రైతులు చలికాలం దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో ఉష్ణోగ్రత తీవ్రత పూర్తిగా పడిపోతుంది. అందువల్ల నారు మడిలో నీరును మారుస్తూ నీటి యజమాన్యం పాటించాలి. దీంతో చలి నుంచి నారుమడిని కాపాడు కోవచ్చు. నారు ఆరోగ్యంగా పెరిగితేనే పంట దిగుబడి వస్తుంది.

kumaram bheem asifabad- నారు దశ.. జాగ్రత్తలే రక్ష
నారుమడి

- రాత్రిపూట నీరు తీసి.. ఉదయం నింపాలి

- యజమాన్య పద్ధతులు పాటిస్తే మేలు

కౌటాల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలో రైతులు వరి నారు మడులు తయారు చేస్తున్నారు. వరి పంట సాగులో భాగంగా నారు మడి తయారు చేయు రైతులు చలికాలం దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో ఉష్ణోగ్రత తీవ్రత పూర్తిగా పడిపోతుంది. అందువల్ల నారు మడిలో నీరును మారుస్తూ నీటి యజమాన్యం పాటించాలి. దీంతో చలి నుంచి నారుమడిని కాపాడు కోవచ్చు. నారు ఆరోగ్యంగా పెరిగితేనే పంట దిగుబడి వస్తుంది. అందు వల్ల నారుమడ్ల యజమాన్య పద్దతులు పాటించాలి. మండలంలో నారుమడుల తయారీలో ఉన్న రైతులకు ఈ చలికాలంలో తీసు కోవల్సిన సూచనలను మండల వ్యవసాయాధికారి తెలిపారు.

- నారుమడి తయారీ..

రెండు గుంటల నారుమడికి రెండు క్వింటాళ్ల కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మీకంపోస్టును వేసి కలియదున్నాలి. ఈ సేంద్రియ ఎరువులను నారుమడుల్లో వాడడం వల్ల చలి తీవ్రతలో కూడా నారుకు పోషకాలు అంది ఎదగుదలకు తోడ్పడుతుం ది. లేదంటే రెండు గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 1 కిలో పొటాష్‌ను వేయాలి. యాసంగిలో వరి పంట వేయాలనుకునే రైతులు స్వల్ప కాలిక రకాలను ఎంచుకోవడం ఉత్తమం. ఎదుకంటే నీటి లభ్యత పంట కాలం ఎక్కువైతే సమస్యలు ఎదుర వుతాయి. అదే విధంగా వడగండ్లు తదితర విపత్తులు సంభవించే అవకాశం ఉంటుంది.

- చలితో జింక్‌ లోపం..

చలి అధికమైనప్పుడు జింక్‌ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల నారుమడిలో రెండు గ్రాముల జింక్‌ సల్ఫేట్‌కు లీటర్‌ నీటిలో కలిపి పిచికా రి చేయాలి. మొలక కట్టిన విత్తనాన్ని నారుమడిలో మొదటి వారం రోజుల పాటుగా తక్కువగా ఉంచాలి. రాత్రి ఉష్ణోగ్రత్తలు 12 డిగ్రీలకు కంటే తక్కువ ఉన్నప్పుడు నారు ఎదుగదు. కొన్ని సార్లు వరి చనిపోతుంది. దీని కోసం రసాయన ఎరువులను వినియోగించాలి. చలి సమస్యను అధిగమనించడానికి వరి మడ్లపై టార్పాలీన్‌లు రాత్రి పూట ఉంచి ఉదయం పూట తీసి వేయాలి. రాత్రి పూట వరి మడి నుంచి పూర్తిగా నీరు తీసి వేసి ఉదయం పూట తాజా నీటిని నింపాలి. దీంతో వరి ఎదుగుదలలో లోపం లేకుండా ఉంటుంది. కాండం తొలిచే పురుగు (మొగ్గ పురుగు) నుంచి పంటను కాపాడుకోవడానికి నారు తలలు తుంచి నాటు వేసుకోవాలి. దీంతో కాండం తొలిచే పురుగు నారు కోనలపై గుడ్లు పొదుగుతుంది. దీని వల్ల గుడ్లతో పాటు మొగ్గ పురుగును నివారించవచ్చు. నారు తీసే వారం రోజు ల ముందు ఎకరా నారుమడికి 1 కిలో కార్పొప్యూరో త్రీజీ లేదా కార్టప్‌ హైడ్రోక్లోరైడ్‌ పోర్‌జీ గుళికలను వేసుకున్నట్లయితే నాటు వేసిన నెల రోజుల వరకు కీటకాలు ఆశించకుండా పంటను రక్షించుకోవచ్చు.

- ఎకరానికి 30 నుంచి 35 కిలోలు..

ఎకరానికి 30 నుంచి 35 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్పొం డిజనతో విత్తన శుద్ధి చేయాలి. దీంతో విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టవచ్చు. నిద్రావ్యవస్థలో ఉన్న విత్తనాలను మేలుకొల్పడానికి కిలో విత్తనానికి 10 మిల్లీ లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టాలి. పశువుల పేడ గాని, సేంద్రియ ఎరువును ఎకర నారుమడికి 100 నుంచి 200 కిలోల నత్రజనిని, కిలో పోటాషియంను చల్లాలి. వ్తినాలు విత్తిన 15 రోజులకు 2 కిలోల భాస్వరం వేసుకోవాలి.

అధికారుల సలహాలు పాటించాలి..

- ప్రేమలత, వ్యవసాయాధికారి, కౌటాల

పంటల సాగులో అధికారుల సలహాలు పాటించా లి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నారు మడుల్లో సాయంత్రం వేసిన నీటిని ఉదయం తొలగించాలి. చలి తీవ్రత నుంచి నారు మడిని కాపాడుకోవడానికి వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుంటే మంచిది. నారు మడికి కావ ల్సిన వెచ్చదనం అందించే ఎరువులను వాడుకుంటే ఫలితం. నాటు ఏపుగా ఎదిగే అవకాశం ఉంటుంది.

Updated Date - Dec 01 , 2025 | 10:18 PM