Narsingh Town Planning Officer Caught: ఎల్‌ఆర్‌ఎస్ జారీకి రూ.4.50 లక్షల లంచం
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:07 AM
ఓ వెయ్యి గజాల ఫ్లాట్‌కు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ అనుమతుల జారీకి రూ.4.50 లక్షలు డిమాండ్ చేసిన నార్సింగ్ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ ...
ఏసీబీకి చిక్కిన నార్సింగ్ టౌన్‌ప్లానింగ్ అధికారిణి
నార్సింగ్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఓ వెయ్యి గజాల ఫ్లాట్‌కు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ అనుమతుల జారీకి రూ.4.50 లక్షలు డిమాండ్ చేసిన నార్సింగ్ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారిణి మణిహారిక ఏసీబీకి పట్టుబడ్డారు. మంచిరేవులకు చెందిన వినోద్‌కు వెయ్యి గజాల ఫ్లాట్ ఉంది. ఆ భూమికి ఎల్‌ఆర్‌ఎస్ పర్మిషన్ క్లియర్ చేసేందుకు గండిపేట మండలం నార్సింగ్ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారిణి మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. చివరికి రూ.4.5 లక్షలకు అంగీకరించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని వినోద్ ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం వినోద్ నుంచి మొదటి విడతగా రూ.4లక్షలు తీసుకుంటుండగా మణిహారికను పట్టుకున్న అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. కాగా, కొద్ది రోజుల క్రితం మణిహారికను చేవెళ్ల ప్రాంతంలో పట్టుకొనేందుకు ఏసీబీ ప్రయత్నించినట్టు తెలిసింది. చేవెళ్ల ఇన్‌చార్జి టౌన్‌ప్లానింగ్ అధికారిగా ఉన్న మణిహారికపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చేవెళ్లలో ప్రైవేటు వ్యక్తులను పెట్టి వసూళ్లు చేయించినట్లు సమాచారం.