Narayana students: అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్ 2025లో నారాయణ విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:10 AM
అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్-2025లో నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు...
27 మంది పాల్గొనగా 13 పతకాలు సొంతం
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్-2025లో నారాయణ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. వివిధ విభాగాల్లో ప్రాతినిధ్యం వహించిన 27 మందిలో 13 మంది పతకాలు సాధించారు. వీరిలో ఏడుగురు స్వర్ణ, ఆరుగురు రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ ఆయా విద్యార్థులను అభినందించి మాట్లాడారు. సరైన మార్గదర్శకత్వం, పట్టుదల ఉంటే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో చదివే ప్రతి విద్యార్థులు తమ పూర్తి ప్రతిభా సామర్థాన్ని గ్రహించే శక్తిని కలిగి ఉంటారన్నారు. అందుకే తమ విద్యాసంస్థలు అంతర్జాతీయ వేదికపై విజయాలు సాధిస్తున్నట్లు తెలిపారు. మరో డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ.. ఈ విజయం వెనుక ఏళ్ల తరబడి కృషి, క్రమశిక్షణతో పాటు అధ్యాపకుల నిరంతర తోడ్పాటు ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దే నారాయణ సంస్థల విద్యావిధానానికి ఈ పతకాలే నిదర్శనమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తమ విద్యాసంస్థలపై అపారమైన నమ్మకాన్ని నింపాయన్నారు.