Share News

Narayana JEE Ranks: నారాయణ విద్యార్థుల జయకేతనం

ABN , Publish Date - Apr 20 , 2025 | 06:19 AM

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు మరోసారి ఘనవిజయం సాధించారు. ఓపెన్‌ కేటగిరీలో బణిబ్రత మాజీ 1వ ర్యాంకు, శివేన్‌ వికాస్‌ 9వ ర్యాంకు సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు

Narayana JEE Ranks: నారాయణ విద్యార్థుల జయకేతనం

  • జేఈఈ మెయిన్‌లో 10లోపు 2 ర్యాంకులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకులతో తమ విద్యార్థులు సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్‌ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో బణిబ్రత మాజీ 1వ ర్యాంకు, టి.శివేన్‌ వికాస్‌ 9వ ర్యాంకు, సౌరవ్‌ 12వ ర్యాంకు, ఆర్చిస్మాన్‌ నంది 13, సన్నధ్య షరాఫ్‌ 19, ఆయుష్‌ సింఘాల్‌ 20వ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరీలో తమ విద్యార్థులు 100లోపు 25 టాప్‌ ర్యాంకులు, వెయ్యిలోపు 165 ర్యాంకులు సాధించారని వెల్లడించారు. గత ఆరేళ్లలో ఓపెన్‌ క్యాటగిరిలో మూడుసార్లు ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు సాధించామని వివరించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Apr 20 , 2025 | 06:19 AM