Share News

Student Wins Gold at National Skating Championship: జాతీయ స్కేటింగ్‌లో నారాయణకు బంగారు పతకం

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:41 AM

సీబీఎ్‌సఈ నిర్వహించిన 6వ జాతీయ ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో తమ విద్యార్థులు అద్భుత విజయాలు సాధించారని నారాయణ విద్యాసంస్థ......

Student Wins Gold at National Skating Championship: జాతీయ స్కేటింగ్‌లో నారాయణకు బంగారు పతకం

  • విద్యాసంస్థల డైరెక్టర్‌ సింధూర నారాయణ

హైదరాబాద్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): సీబీఎ్‌సఈ నిర్వహించిన 6వ జాతీయ ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో తమ విద్యార్థులు అద్భుత విజయాలు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌ పి.సింధూర నారాయణ తెలిపారు. జాతీయ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలో తమిళనాడులోని మదురై నారాయణ పాఠశాలకు చెందిన ఎం.తమిళినియన్‌ అండర్‌-11 విభాగంలో బంగారు పతకం సాధించారని అన్నారు. కూడో చాంపియన్‌షి్‌పలో ఒడిసా రాష్ట్రం కటక్‌లోని నారాయణ పాఠశాల విద్యార్థి ఆయుష్‌ కుమార్‌ లేంకా అండర్‌-12లో, సులగ్న లేంకా అండర్‌-15 బాలికల విభాగంలో వెండి పతకాలు సాధించారని ఆమె సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం చదువు వరకే పరిమితం కాకుండా విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా డైరెక్టర్‌ తెలిపారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సింధూర నారాయణ అభినందనలు తెలిపారు.

Updated Date - Dec 02 , 2025 | 05:41 AM