Narayana Institutions: నారాయణ విద్యాసంస్థల్లో మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:55 AM
విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చేయడం లక్ష్యంగా తమ విద్యార్థులకు 6వ...
హైదరాబాద్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలు అభివృద్ధి చేయడం లక్ష్యంగా తమ విద్యార్థులకు 6వ ‘మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్’ పోటీలు తెలంగాణలో విజయవంతంగా నిర్వహించామని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ పాఠశాలల్లో 1-9వ తరగతుల విద్యార్థులకు గత జూలైలో ప్రారంభించిన ఈ పోటీలు ఇటివలే ముగిశాయని, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయని విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘నేను జంతువులతో మాట్లాడగలిగితే’, ‘నేను సూపర్ హీరో అయితే’, ‘ప్రపంచంలో నేను మార్చాలనుకునే ఒక విషయం’ వంటి ఆలోచనాత్మక అంశాలపై ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులు ప్రసంగించారని వారు పేర్కొన్నారు. గుణాత్మక విద్య, లింగ సమానత్వం, ఆరోగ్యం-శ్రేయస్సు, కాలుష్య నియంత్రణ వంటి సామాజిక అంశాలపై 8, 9వ తరగతుల విద్యార్థులు మాట్లాడారని, విజేతలకు బహుమతులు ప్రదానం చేశామని డైరెక్టర్లు తెలిపారు.