Nara Bhuvaneshwari: కుటుంబంలో మహిళదే కీలక పాత్ర: నారా భువనేశ్వరి
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:37 AM
కుటుంబంలో మహిళదే కీలక పాత్ర అని ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చెప్పారు. అమ్మగా, చెల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వహించడం...
ఎన్టీఆర్ భవన్‌లో స్త్రీ శక్తి హస్తకళ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కుటుంబంలో మహిళదే కీలక పాత్ర అని ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చెప్పారు. అమ్మగా, చెల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వహించడం సృష్టి గొప్పదనమని, ప్రేమ, ధైర్యం మహిళల్లోనే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో స్త్రీశక్తి హస్తకళ స్టోర్‌ను భువనేశ్వరి ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 511 మంది మహిళలు ఎంబ్రాయిడరీ, టైలరింగ్ వంటి విభాగాల్లో శిక్షణ పొందారు. ఇక్కడి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం తొలి స్ర్తీశక్తి స్టోర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వచ్చే లాభం మహిళలకేనని, ఎన్టీఆర్ ట్రస్టు ఒక్క పైసా తీసుకోదని భువనేశ్వరి స్పష్టం చేశారు.