క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:22 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనరసిం హుడికి నిత్య కల్యాణం, నిత్యార్చనలు శాసో ్త్రక్తంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట, జూలై 22(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనరసిం హుడికి నిత్య కల్యాణం, నిత్యార్చనలు శాసో ్త్రక్తంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఆంజనేయస్వామికి ఆలయంలో అర్చకులు వేద మంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం చేసిన అర్చకులు తమలపాకులు, సింధూరం, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ప్రధానాలయంలో స్వయంభువులను సుప్రభాత సేవలతో మేల్కొలిపి నిజాభిషేకం, నిత్యార్చనలు, ముఖమండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామికి ముఖ మండపంలోని స్ఫటికమూర్తులకు నిత్య పూజలు, నిత్య రుద్రహవనం శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో ఆంజనేయ స్వామిని పంచామృతాలతో అభిషేకించి ఆకుపూజ చేపట్టారు.
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీ నృసింహుడి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహుడి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆర్జిత కైంకర్యాలు జరిగాయి. కల్యాణ మూర్తులను పరిణయోత్సవ వేదికపైకి వేంచేయించి పుణ్యాహవాచనం గావించారు. మాంగళ్యధారణ, యజ్ఘోపవీత ధారణల అనంతరం దివ్యమూర్తులకు గరుడోత్సవం జరిగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో సిరికొండ నవీన్, ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.