క్షేత్రపాలకుడికి నాగవల్లీ దళార్చనలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:59 PM
యాద గిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొలువు దీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళ వారం నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం, నిత్యార్చనలు శాస్త్రోక్తంగా కొనసా గాయి.
యాదగిరిగుట్ట, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): యాద గిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొలువు దీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళ వారం నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం, నిత్యార్చనలు శాస్త్రోక్తంగా కొనసా గాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఆంజనేయ స్వామికి ఆలయంలో అర్చకులు వేద మంత్ర పఠ నాలతో పంచామృతాభిషేకం చేసిన అర్చకులు తమలపాకులు, సింధూరం, వివిధ రకాల పుష్పా లతో అలంకరించారు. ఆంజనేయుడికి సహస్రనామ పఠనాలతో నాగవల్లీ దళార్చనలు నిర్వహించి హారతి ఇచ్చారు. ప్రధానాలయంలో స్వయంభువు లను సుప్రభాత సేవలతో మేల్కోలిపి నిజాభిషేకం, నిత్యార్చనలు, ముఖమండపంలో సుదర్శన నారసిం హ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలను పాంచారాత్రగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామికి ముఖ మండపంలోని స్ఫటికమూర్తులకు నిత్య పూజలు, నిత్య రుద్రహవనం శైవాగమన పద్ధతిలో కొనసాగాయి. పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించి ఆకుపూజ నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 23,19,119 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్. వెంకట్రావు తెలిపారు.