Share News

ఆంజనేయుడికి నాగవల్లీ దళార్చన

ABN , Publish Date - May 21 , 2025 | 12:35 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం మంగళవారం శాస్త్రోక్తంగా కొనసాగాయి.

ఆంజనేయుడికి నాగవల్లీ దళార్చన
హిమాన్షుకు వేద పండితుల ఆశీర్వచనం

యాదగిరిగుట్ట మే 20 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం మంగళవారం శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఆంజనేయస్వామికి ఆలయంలో అర్చకులు వేద మంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం చేసిన అర్చకులు తమలపాకులు, సింధూ రం, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆం జనేయుడికి సహస్రనామ పఠనాలతో నాగవల్లీ దళార్చనలు నిర్వహించి హారతి ఇచ్చారు. ప్రధానాలయంలో స్వయంభువులను సుప్రభాత సేవలతో మే ల్కొలిపి నిజాభిషేకం, నిత్యార్చనలు, ముఖమండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో అంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించి ఆకుపూజ చేపట్టారు.

రేపు హనుమాన్‌ జయంతి

హనుమాన్‌ జయంతి సందర్భంగా అంజనేయ స్వామి జయంతి మహోత్సవాలు రేపు (గురువారం) ఉదయం 9గంటలకు కొండపైన విష్ణుపుష్కరిణిలో గల ఆంజనేయ స్వామి వారి ఆలయం, పాతగుట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో అష్టోత్తర శతమన్యసూక్త పారాయణాలతో అభిషేకం, లక్ష తమలపాకులతో సహస్రనామర్చన, మహానివేదన కార్యాక్రమాలు నిర్వహించినట్లు ఈవో తెలిపారు. రూ.516టికెట్‌తో విష్ణుపుష్కరిణి చెంత ఆలయంలో లక్ష తమలపాకుల అర్చనలో పాల్గొనాలని కోరారు.

హిమాన్షు ప్రత్యేక పూజలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మనమడు, మాజీమంత్రి కేటీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు జన్మదినం సందర్భంగా ఆలయంలో స్వయంభువులను దర్శించుకుని పూజలు చేశారు. వేద పండితులు వేద మం డపంలో వేద ఆశీర్వచనం చేశారు. ఆయన వెంట మాజీ ప్రభు త్వ విప్‌, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్‌ఎస్‌ మండలాద్యక్షుడు కర్రె వెంకటయ్య, మాజీ ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డంమీద రవీందర్‌, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:35 AM