R&B Engineers Association: ఆర్ అండ్ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్. శ్రీను
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:05 AM
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. శ్రీను ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా..
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. శ్రీను ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు, ట్రెజరర్‌గా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇ. మహేందర్ సహా మరో ఆరుగురు ఇతర పోస్టులకు ఎన్నికయ్యారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన వారికి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. శాఖ బలోపేతానికి ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు.