Share News

రైతుల సేవకే నా జీవితం అంకితం

ABN , Publish Date - May 08 , 2025 | 11:56 PM

డీసీసీబీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన రైతుల సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.

రైతుల సేవకే నా జీవితం అంకితం
యాదగిరిగుట్టలో కేక్‌ కట్‌ చేస్తున్న డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట రూరల్‌, మే 8, (ఆంధ్రజ్యోతి): డీసీసీబీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన రైతుల సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక సింహద్వారం ఎదుట కుటుంబసభ్యులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు జరుపు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ సహకారంతో డీసీసీబీ చైర్మన్‌గా రైతులకు కోట్లాది రూపాయల స్వల్ప కాలిక, ధీర్ఘకాలిక, రైతులు పిల్లలు ఉన్నత చదువుల కోసం బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించామన్నారు. తన భార్య గొంగిడి సునీతను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, గుట్ట పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇమ్మిడి రాంరెడ్డి, కసావు శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ గౌడమీది రవీందర్‌గౌడ్‌, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధబీరయ్య, మిట్ట వెంకటయ్యగౌడ్‌, పాపట్ల నరహరి, గుండ్లపల్లి వెంకటేశంగౌడ్‌, ముక్కెర్ల సత్యనారాయణ, గడ్డం చంద్రంగౌడ్‌, గుంటి మధుసూదన్‌రెడ్డి, పాండవుల భాస్కర్‌గౌడ్‌, బైరగాని పుల్లయ్యగౌడ్‌, ఆకుల రాజేష్‌, బూడిద అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.

మోటకొండూరు: డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మండలకేంద్రంలో కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొట్ల యాదయ్య, అనంతుల జంగారెడ్డి, ఎండీ బురాన్‌, బాల్ద లింగం, నక్కిర్త ఉప్పలయ్య, బుగ్గ భాస్కర్‌, అయిలయ్య, బిక్షపతి పాల్గొన్నారు.

ఆలేరు: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గొంగిడి మహేందర్‌రెడ్డిని కార్యకర్తలు ఆలేరులో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్‌, రామనర్సయ్య, వస్పరి శంకరయ్య, ఎం. మాధవి వెంకటేశ్‌, బొట్ల పరమేశ్వర్‌, నాగరాజు, విద్యాసాగర్‌, బాలస్వామి, ఎం. వెంకటేశ్‌, జూకంటి ఉప్పలయ్య పాల్గొన్నారు.

రాజాపేట: డీసీసీబీ మాజీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను రాజాపేటలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సట్టు తిరుమల్లేష్‌, జశ్వంత్‌, బాలమణి, భాస్కర్‌రెడ్డి, వీరేశం, భాస్కర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:56 PM