చూపు సన్నగిల్లుతోంది
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:16 PM
చిన్నారులు అ ల్లరి చేసినా.. అన్నం తినాలన్నా.. మారాం చేయకుం డా సైలెంట్‌గా ఉండాలన్నా.. ఏదైనా పని చెబితే చేయా ల న్నా పిల్లలకు తల్లిదండ్రులు అందిస్తున్న ఒకేఒక ఆయు ధం సెల్‌ఫోన్. ప్రస్తుతం దీని ఫలితంగా చిన్న వయ స్సులోనే పిల్లలు రకరకాల వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. చీకట్లో, వెలుతురులో తదేకంగా సెల్‌ఫోన్ చూస్తుండడంతో బాల్యంలోనే కంటి సమస్యలతో బాధ పడుతున్నారు.
చిన్నారుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
సెల్‌ఫోన్ ప్రభావం, పోషకాహార లోపమే ప్రధాన కారణం
ఆర్‌బీఎస్‌కే పరీక్షల్లో వెలుగు చూస్తున్న వైనం
అవసరమైన వారికి అద్దాలు, ఆపరేషన్లు
జిల్లాలో 1143 మంది హైస్కూల్ విద్యార్థులకు కంటి సమస్యలు
ఆందోళనలో తల్లిదండ్రులు
కాసిపేట, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు అ ల్లరి చేసినా.. అన్నం తినాలన్నా.. మారాం చేయకుం డా సైలెంట్‌గా ఉండాలన్నా.. ఏదైనా పని చెబితే చేయా ల న్నా పిల్లలకు తల్లిదండ్రులు అందిస్తున్న ఒకేఒక ఆయు ధం సెల్‌ఫోన్. ప్రస్తుతం దీని ఫలితంగా చిన్న వయ స్సులోనే పిల్లలు రకరకాల వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. చీకట్లో, వెలుతురులో తదేకంగా సెల్‌ఫోన్ చూస్తుండడంతో బాల్యంలోనే కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. దీని వల్ల చిన్నతనంలోనే పిల్లలకు చూ పు మసకబారుతోంది. గతంలో పాఠశాల, కళాశాల స్థా యిలో తరగతి గదుల్లో ఒకరిద్దరికి కంటి అద్దాలు ఉం డేవి. కానీ ఇప్పుడు దాదాపు 80శాతం మంది పిల్లలు కంటి అద్దాలతో కనిపిస్తున్నారు. మూడేళ్లకే పాఠశాలల కు పంపించడం పోషకాహారం సరిగ్గా ఇవ్వకపోవడం వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు, తదితర కారణా లతో బాల్యం నుంచే చూపు మసక బారుతుందని వై ద్యులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బాల్యం దశ లోనే పిల్లల్లో అంధత్వ నివారణ చర్యలు చేపట్టాలన్నా ఆదేశాల మేరకు రాష్ర్టీయ బాల శాస్ర్తీయ కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) ద్వారా అంగన్‌వాడీ కేంద్ర ఆరేళ్లలోపు చి న్నారులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలో 4124 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,98,094 మంది పిల్లలున్నారు. వీరిలో 1,24,279 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 36 మందికి కంటి అద్దాలు అవ సరం కాగా 103 మందికి ఆపరేషన్ల అవసరం పడింది. అలాగే జిల్లాలోని 684 హైస్కూళ్లలో 35,964 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 1143 మందికి కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
ఏయే పరీక్షలు చేస్తున్నారంటే...
పిల్లల్లో కంటి వ్యాధి గ్రస్తత కనురెప్ప కిందకి పడి పోవడం, కళ్లనుంచి నీరు రావడం కళ్లరెప్పలు నియం త్రించలేని స్థితుల్లో కదలడం, ఒకే దిశలో చూడక పోవ డం, కంటిలో తేమ లేకపోవడం, కంటిపై ఒక వైపు మాంసం పెరగడం, కండ్లు పొడిబారడం, వక్రీభావన లోపాలు సరిగ్గా తెరవకపోవడం, కళ్లపై మచ్చలవంటి పరీక్షలు చేపట్టారు. కంటి పరీక్షల సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు పోషకాహారం తదితర అంశాలపై కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ఆర్‌బీకేఎస్ నిర్వహించిన కంటి పరీక్షల నిర్వహణ...
మంచిర్యాల జిల్లాలో 969 కేంద్రాలు ఉండగా 37,185 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో పది మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఆసి ఫాబాద్ కొమురం భీం జిల్లాలో 973 అంగన్‌వాడీ కేం ద్రాలు ఉండగా 28,467 మందికి కంటి పరీక్షలు నిర్వ హించగా 30మంది కంటి సమస్యతో బాధపడుతున్న ట్లు వైద్యులు గుర్తించారు. వీరికి అవసరం మేరకు కం టి అద్దాలు ఇచ్చి ఆపరేషన్లు చేయించారు.
సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోవడమే...
కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిం చారు. దీంతో చిన్నారుల్లో సెల్‌ఫోన్ వినియోగం విపరీ తంగా పెరిగిపోయింది. ప్రస్తుతం పాఠశాలల నుంచి ఇండ్లకు చేరిన తరువాత పిల్లలు వీడియో గేమ్స్, సిని మాలు, తదితరాలకు సెల్‌ఫోన్‌లు వినియోగిస్తున్నారు. ఎక్కువ సమయం స్ర్కీన్ చూడడంతో దృష్టిలోపం వ స్తున్నట్లు వైద్యులు గుర్తించారు. కొందరికి తల్లిదండ్రు లే గంటల తరబడి సెల్‌ఫోన్ ఇవ్వడం దృష్టి లోపానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
దృష్టిలోపానికి కారణాలు...
పిల్లల్లో విటమిన్ ఎ లోపంతో రేచికటి, గ్లూకోమా వంటి కంటి సమస్యలు వస్తున్నాయి. పోషకాహార లో పంతో ఏ విటమిన్ లోపిస్తుంది. కొందరికి పుట్టుకతోనే సమస్యలు వస్తున్నాయి. వీటికి జన్యుపరమైన కారణా లు, మేనరికం పెండ్లీలు, గర్భంతో ఉన్నప్పుడు తల్లి తీ సుకునే ఆహారం, మెడిసిన్‌కు కారణమవుతుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...
కళ్లను రోజు చల్లని మంచినీటితో కడగాలి. కంటికి సురుమ కాటిక వంటివి వాడకపోవడమే మంచిది. దు మ్ము, పొగ ప్రశాశవంతమైన క్రాంతివైపు కళ్లను నేరుగా తెరిచి చూడరాదు. చదవే సమయంలోసెల్‌ఫోన్ చూ స్తున్నప్పుడు ప్రతి పదిహేను నిమిషాలకు ఒక సారి కండ్లను విధిగా విరామం ఇవ్వాలి. దృష్టిలోపం ఉంటే కళ్లజోడు వాడడం తప్పనిసరి.
పిల్లల్లో ఫిజికల్ ఫిట్‌నెస్ తగ్గిపోతుంది...
ఆర్‌బీఎస్‌కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మశ్రీ
ఈ కాలం పిల్లలకు ఫిజికల్ ఫిట్‌నెస్ తగ్గి రోగాల భారినపడుతున్నారు. పిల్లలకు సెల్‌ఫోన్‌కు బానిసలు కావద్దంటే ఇంట్లోనే అమ్మనాన్నలు వారితో కొంత సమ యం కేటాయించి వాడుకోవాలి. మిగితా పిల్లలతో క లిసి స్కూల్లో కానీ, ఇంటి ఆవరణలో ఇండోర్‌గేమ్స్ ఆడే విధంగా పిల్లలకు సూచనలు చేయాలి. ముఖ్యంగా చి న్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలి. పిల్లల పట్ల అ మ్మనాన్నలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సెల్‌ఫోన్ భారినపడడంతో పిల్లలు మానసిక రుగ్మత లకు గురవుతారు.
అంధత్వాన్ని నివారించడమే లక్ష్యం...
డాక్టర్ సుధాకర్ నాయక్, అంధత్వ నివారణ సంస్థ(ఎన్‌పీసీవీ జిల్లా అధికారి మంచిర్యాల)
పిల్లల్లో పెరుగుతున్న అంధత్వాన్ని నివారించేందుకు ప్రభుత్వం నుంచి తగిన చర్యలు చేపడుతున్నాం. టీవీ, సెల్‌ఫోన్ వినియోగం వల్ల కంటి సమస్యలపై అవగా హన సదస్సులు నిర్వహిస్తున్నాం. పేపర్ , మీడియా ద్వారా ప్రచారాలు నిర్వహిస్తున్నాం. పిల్లల్లో ఏ విటమిన్ లోపం వల్ల కలిగే అంధత్వాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. కంటి పరీక్షల్లో గుర్తించిన వా రికి కంటి అద్దాలతో పాటు ఆపరేషన్ చేపట్టాం. అంధ త్వం లేని సమాజ నిర్మాణానికి అందరూ సహకరించా లి. అఽధత్వాన్ని నివారించడమే సంస్థ లక్ష్యం.