ముక్కోటికి ముస్తాబు
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:49 AM
ముక్కోటి ఏకాదశి వేడుకలకు దేవదేవుడి దివ్యక్షేత్రం ముస్తాబైంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మా మిడి తోరణాలు, పూలమాలలతో అందంగా తీర్చిదిద్దారు.
నేటి నుంచి అధ్యయనోత్సవాలు
ఆరు రోజులపాటు వైభవంగా అలంకార సేవలు
(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట): ముక్కోటి ఏకాదశి వేడుకలకు దేవదేవుడి దివ్యక్షేత్రం ముస్తాబైంది. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మా మిడి తోరణాలు, పూలమాలలతో అందంగా తీర్చిదిద్దారు. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీప కాంతులతో ఆలయం అద్భుతంగా వెలుగులీనుతోంది. ఆలయ ఉత్తర మాఢవీదుల్లో ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పా టు చేశారు. స్వామివారు దర్శనమిచ్చే ద్వారం ఎదురుగా విశాలమైన వేదికను సిద్ధంచేశారు. ఉత్తర తిరువీధిలో పూర్తిగా ఆకుపచ్చ, ఎరుపు వర్ణంలో మ్యాట్లను పరిచారు. స్వామి అమ్మవారలు తెల్లవారుజామున 5.30 గంటల నుంచి 6.30గంటల వర కు ఉత్తర ద్వార దర్శనమిస్తారు. ఈ మేరకు డీసీపీ అక్షాంశ్‌యాదవ్ సోమవారం ఉత్తర తిరువీధిలో ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు 10వేల భక్తు లు తరలివచ్చే అంచనా ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. యాదగిరిగుట్ట ఏసీపీ పి.శ్రీనివాసులునాయుడు పర్యవేక్షణలో 106 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
వైకుంఠ వేడుకలకు గవర్నర్‌కు ఆహ్వానం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం లో అత్యంత వైభవంగా నిర్వహించనున్న వైకుంఠ ఏకాద శి వేడుకలకు విచ్చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను దేవస్థానం ఈవో ఎస్.వెంకట్రావు ఆహ్వానించారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో సోమవారం పూజారులతో గవర్నర్‌ను కలిశారు. ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యు లు బృందం ముందుగా స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి లడ్డు ప్రసాదం అందించి ఆశీర్వచనం చేశారు.